కవయిత్రి మొల్లకు నివాళి

కవయిత్రి మొల్లకు నివాళి

కవయిత్రి మొల్లకు నివాళిప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ కవయిత్రి మొల్లకు కలెక్టర్‌ లక్ష్మీ శ నివాళి అర్పించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి, పుష్పాంజలి ఘటించారు. కవయిత్రి మొల్ల 1440లో కడప జిల్లా గోపవరం గ్రామంలో జన్మించారన్నారు. మొల్ల రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రాసి తన సరళమైన పదజాలాన్ని ఉపయోగించారన్నారు. రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బి సి సంక్షేమ అధికారి భాస్కర్‌ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య పాల్గొన్నారు.

➡️