కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలయ్యింది : చింతామోహన్‌

కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలయ్యింది : చింతామోహన్‌

కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలయ్యింది : చింతామోహన్‌ప్రజాశక్తి – తిరుపతి (మంగళం) ఏపీలోనూ ఇచ్ఛాపురం నుంచి చిత్తూరు వరకూ కాంగ్రెస్‌ ప్రభంజనం మొదలయ్యిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్‌ ఉద్ఘాటించారు. తిరుపతిలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ దళితుడైన కోడికత్తి శ్రీనును విడుదల చేయాలని, దుగ్గరాజుపట్నం ద్ణుఖరాజపట్నం అయ్యిందన్నారు. బిజెపి జిఎస్‌టితో దోచుకుంటుందన్నారు. ఈనెల 28న తిరుపతి రామతులసి కల్యాణ మండపంలో వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ శ్రేణులతో సమావేశం అవుతారన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు గాను 130 సీట్లు ఏపీలో విజయం సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయకులు యార్లపల్లి గోపి, పూతలపట్టు ప్రభాకర్‌, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️