కేసులతో మనశ్శాంతి కోల్పోవద్దు : జడ్జి రాఘవేంద్ర

కేసులతో మనశ్శాంతి కోల్పోవద్దు : జడ్జి రాఘవేంద్ర

కేసులతో మనశ్శాంతి కోల్పోవద్దు : జడ్జి రాఘవేంద్రపుత్తూరు టౌన్‌ : ఎంతో నగదు, ఆస్తులున్నా మనశ్శాంతి లేనిదే వథా అని సీనియర్‌ సివిల్‌ జడ్జి రాఘవేంద్ర అన్నారు. పుత్తూరు కోర్టు ఆవరణలో లోక్‌అదాలత్‌ శనివారం సీనియర్‌ సివిల్‌ జడ్జి రాఘవేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు కేసులు ఉంటే మనశ్శాంతి ఉండదని, ఎప్పుడు కేసులు పరిష్కారం జరుగుతుందా అని టెన్షన్‌ పడేకంటే, ఒకరినొకరు అర్థం చేసుకుని రాజీ చేసుకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తవని తెలిపారు లోక్‌ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలన్నారు. ప్రిన్సిపల్‌ జూనియర్‌ ప్రధాన జడ్జి జానకి, అదనపు జూనియర్స్‌ సివిల్‌ జడ్జి వి గోపాలకష్ణ, న్యాయవాదులు సంజీవి, మురుగేషన్‌ రెడ్డి, కే పురుషోత్తం, విజరు కుమార్‌ పాల్గొన్నారు.470 కేసులకు పరిష్కారంప్రజాశక్తి-శ్రీకాళహస్తి కోర్టు పరిధిలో పెండింగ్లో ఉన్న 470 కేసులకు జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్రమం ద్వారా సత్వర పరిష్కారం లభించింది. స్థానిక శ్రీకాళహస్తి కోర్టులో శనివారం జాతీయ లోక్‌ అధాలత్‌ నిర్వహించారు. 12వ అదనపు జిల్లా జడ్జ్‌ శ్రీనివాస్‌ నాయక్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి బేబీ రాణి, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కష్ణప్రియ సమక్షంలో క్రిమినల్‌, చెక్‌ బౌన్స్‌, మోటార్‌ ప్రమాద పరిహార కేసులు, లేబర్‌, సివిల్‌ కేసులకు సంబంధించి 470 కేసులను పరిష్కరించారు. తద్వారా రూ.98 లక్షలు రికవరీ చేశారు. అంతకముందు రక్తదాన శిబిరాన్ని న్యాయమూర్తులు ప్రారంభించారు. పలు శాఖల అధికారులు, బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

➡️