క్యాన్సర్‌ను నివారిద్దాం

క్యాన్సర్‌ను నివారిద్దాం

క్యాన్సర్‌ను నివారిద్దాంప్రజాశక్తి – తిరుపతి సిటి క్యాన్సర్‌ నివారణలో తిరుపతి జిల్లాను ఆదర్శంగా చేద్దాం అని స్విమ్స్‌ ఉపకులపతి ఆర్‌వి కుమార్‌ పిలుపునిచ్చారు. స్విమ్స్‌ శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంకాలజీ, కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ పద్మావతి ఆడిటోరియంలో ‘మిడ్‌ లెవెన్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌’ శిక్షణ నిర్వహించినట్లు మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌ తెలిపారు. ఆర్‌వి కుమార్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ రోగులను తొలిదశలోనే గుర్తించి వారికి చికిత్స అందించి ఆస్పత్రులకు తరలించే బాధ్యతలను మిడిల్‌ లెవెల్‌ హెల్త్‌ప్రొవైడర్స్‌ తీసుకోవాలని సూచించారు. బయో ప్రత్యేకాధికారి డాక్టర్‌ ఎం.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 4 నుంచి పింక్‌ బస్సుల ద్వారా క్యాన్సర్‌ నిర్ధారణ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శ్రీహరి, డిపిఎంఒ డాక్టర్‌ అరుణ సులోచన, అంకాలజీ నోడల్‌ ఆఫీసర్‌ ప్రత్యూష పాల్గొన్నారు.

➡️