గంగ కోసం రైతుల పోరాటంఅడ్డుకున్న పోలీసులు ఎంపీ చెప్పినా వినని ఖాకీలు

గంగ కోసం రైతుల పోరాటంఅడ్డుకున్న పోలీసులు ఎంపీ చెప్పినా వినని ఖాకీలు

గంగ కోసం రైతుల పోరాటంఅడ్డుకున్న పోలీసులు ఎంపీ చెప్పినా వినని ఖాకీలుప్రజాశక్తి-శ్రీకాళహస్తి వేసవి సమీపిస్తున్న వేళ తెలుగుగంగ నీటి కోసం రైతన్నలు పోరుబాట పట్టారు. తాగునీటికే కాదు సాగు నీటికీ అవకాశం కల్పించాలంటూ తొట్టంబేడు మండలం లక్ష్మిపురం తెలుగు గంగ ఎస్కేప్‌ గేట్ల వద్ద శుక్రవారం నీటి మళ్ళింపుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న గంగ అధికారులు హుటాహుటిన పోలీసులను పంపి రైతులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో అటుగా వెళ్తున్న తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి విషయం తెలుసుకుని అక్కడకు వెళ్లారు. రైతులు తమ ఆవేదనను చెప్పుకోవడంతో స్పందించిన ఎంపీ గంగ నీటి మళ్ళింపుకు రైతులకు అవకాశం ఇవ్వాలని పోలీసులను ఆదేశించి వెళ్లారు. అయితే ఎంపీ అటు వెళ్లగానే పోలీసులు మళ్ళీ గంగ నీటిని మళ్ళిస్తున్న రైతులను అడ్డుకున్నారు. రైతులు ఎంత చెప్పినా వినకుండా దౌర్జన్యానికి దిగారు. తెలుగు గంగ ఎస్‌ఈ చెబితే తప్ప నీటిని మళ్ళించే ప్రసక్తి లేదని తెగేసి చెప్పడంతో చేసేది లేక రైతులు తిరుగుముఖం పట్టారు. తెలుగుగంగ నీటి ద్వారా తొట్టంబేడు, కేబీబీపురం మండలాల సరిహద్దుల్లోని కాలువ పరీవాహక ప్రాంతాల రైతులు పెద్ద ఎత్తున పంటలు పండిస్తున్నారు. కొందరు నేరుగా నీటిని వాడుకుంటుండగా, మరి కొందరు చెరువులకు మళ్ళించి తద్వారా ఆయకట్టు పారించుకుంటున్నారు. అయితే కాలువలో నీటి ప్రవాహం తక్కువుగా ఉండడంతో సాగునీటి వినియోగానికి గంగ అధికారులు మోకాలడ్డుతున్న పరిస్థితి. దీంతో రైతులు రబీలో వేసిన తమ పంటలను కాపాడుకోవడం కోసం ఇలా సాగునీటి పోరాటానికి దిగగా ఖాకీలు భగం చేసి రైతులకు మొండిచెయ్యి చూపడం విచారకరం.

➡️