ఘనంగా పోలీస్‌ సిబ్బంది ఉద్యోగ విరమణ

ఘనంగా పోలీస్‌ సిబ్బంది ఉద్యోగ విరమణ

ఘనంగా పోలీస్‌ సిబ్బంది ఉద్యోగ విరమణ ప్రజాశక్తి -తిరుపతి సిటీ: తిరుపతి జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి చేతుల మీదగా ఉద్యోగ విరమణ పొందిన 21 మందికి పోలీస్‌ అధికారులు, సిబ్బందికి సన్మానం నిర్వహించారు. స్థానిక పిఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు విచ్చేసిన ఎస్పీ మాట్లాడుతూ పోలీస్‌ శాఖకు ఇన్నాళ్లు మీరు చేసిన సేవలు అమోగం, మరుపురానివని కొనియాడారు. వారికి శాలువాలు, పూల దండలు వేసి జ్ఞాపికలను అందజేసి కుటుంబ సభ్యులకు ఆశీస్సులు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ యస్‌పి లు వెంకటరావు, విమలకుమారి, డి.యస్‌.పి లు నరసప్ప, సురేంద్ర రెడ్డి, పదవి విరమణ పొందిన కుటుంబ సభ్యులు, పోలీసు అసోసియేషన్‌ ప్రసిడెంట్‌ సోమశేఖర్‌, సేకరేట్రీ శంకర్‌ రెడ్డి, కామరాజు, శేఖర్‌ పాల్గొన్నారు.

➡️