చంద్రగిరిలో ఫ్లెక్సీల రగడ, టిడిపి ఫ్లెక్సీల తొలగింపుకు అధికారుల ప్రయత్నం అడ్డుకున్న టిడిపి శ్రేణులు.చెవిరెడ్డీ చిల్లర రాజకీయాలు మానుకో- తెదేపా శ్రేణులు.

చంద్రగిరిలో ఫ్లెక్సీల రగడ, టిడిపి ఫ్లెక్సీల తొలగింపుకు అధికారుల ప్రయత్నం అడ్డుకున్న టిడిపి శ్రేణులు.చెవిరెడ్డీ చిల్లర రాజకీయాలు మానుకో- తెదేపా శ్రేణులు. ప్రజాశక్తి రామచంద్రాపురం( చంద్రగిరి)సంక్రాంతి పర్వదినాలలో చివరి రోజు అమ్మవారి కొండ చుట్టు ఉత్సవాలను చంద్రగిరిలో వైభవంగా నిర్వహించటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన యువ నాయకులు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రహదారులకు పక్కన భక్తులను ఆహ్వానించే విధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ యువత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు చంద్రగిరి పంచాయతీ ఈవో మహేశ్వరయ్య మంగళవారం ఉదయం తమ సిబ్బందితో ఫ్లెక్సీలు వద్దకు చేరుకుని తొలగించే ప్రయత్నం చేశారు. తాము ప్రజాజీవనానికి ఇబ్బంది లేకుండా గ్రామదేవత శ్రీమూలస్థాన ఎల్లమ్మ కొండ చుట్టు ఉత్సవాలను పురస్కరించుకొని ప్రజలకు ఆహ్వానం పలికే విధంగా ఫ్లెక్సీని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని వీటిని మీరు ఎలా తొలగిస్తారని టిడిపి శ్రేణులు అడ్డుకోవడం జరిగింది. దీంతో కొద్దిసేపు పంచాయతీ ఈవో తెలుగుదేశం పార్టీ యువత మధ్యన వాగ్వాదం నెలకొంది. ఫ్లెక్సీలు ఏర్పాటుకు అనుమతి లేని కారణంగానే పై అధికారుల ఆదేశంతో తొలగించడానికి వచ్చామని ఈవో వివరణ ఇచ్చినప్పటికీ యువత అందుకు సుముఖత చూపలేదు. అప్పటికప్పుడే అనుమతి కోసం చంద్రగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ కు వినతిపత్రం సమర్పిస్తూ మండల అభివృద్ధి అధికారానికి కాపీ జత చేశారు. మా ఈ ఫ్లెక్సీలు రెండు రోజులు ఏర్పాటుకు ఎలాంటి పంచాయితీ రుసుము చెల్లించడానికైనా తాము సుముఖంగా ఉంటున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాలతోనే మండల అభివృద్ధి అధికారి బాలాజీ నాయక్ తమ దిగవస్థాయి సిబ్బందికి ఫ్లెక్సీలు తొలగించడానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెదేపా శ్రేణులు ఆరోపించారు. ప్రాణాలైనా అర్పిస్తాం మా ఫ్లెక్సీలను తొలగించేందుకు ఒప్పుకునేది లేదని వ టిడిపి శ్రేణులు భీష్ముంచుకున్నారు. గ్రామదేవత శ్రీ మూలస్థానం ఎల్లమ్మ ఏ ఒక్క పార్టీకే పరిమితం కాదని అన్ని పార్టీల ఆరాధ్య దైవం అని ఏ పార్టీ వారైనా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే భక్తులను ఆహ్వానించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవచ్చని ఇతర పార్టీల నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తమకు అభ్యంతరం లేదని వారు తెలిపారు. ఒకవేళ ఇందులో స్థానిక శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉంటే ఇలాంటి చిల్లర రాజకీయాలు తగమని తెదేపా శ్రేణులు సున్నితంగా హెచ్చరించారు. చంద్రగిరి పాతపేట రెడ్డి వీధి సర్కుల్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ/కటౌట్లు ల విషయంలో ఈ వివాదం చెలరేగింది. చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆదేశాలతోనే అధికారులు అత్యుత్సాహం చూపించారా లేదా ఆయన మన్ననలు పొందటానికి దూకుడుగా వ్యవహరించారా అన్నది చర్చనీయాంశం అయింది. చెవిరెడ్డి ప్రమేయం లేకుండానే అధికారులే దూకుడుగా వ్యవహరించి ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో శాంతి బద్రతల సమస్య రేకెత్తే విధంగా ప్రవర్తించిన అధికారులను ఆయన మందలించాల్సి ఉంది. అలా కాకుండా రాజకీయ దురుద్దేశంతో తానే అధికారులను ఆదేశించి ఉంటే ఆయన స్వగ్రామమైన తుమ్మలగుంట లో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏ ఒక్క పార్టీకి చెందిన వాడు కాదని అన్ని పార్టీలు ప్రజలందరికీ చెందిన వాడని అక్కడ ఏ కార్యక్రమం జరిగినా రాజకీయ లబ్ధి కోసం చంద్రగిరి నుండి తిరుపతి వరకు ఆయన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం ఎంతవరకు సబబు అని తెదేపా నాయకులు ఆరోపించారు. సున్నితమైన ఇలాంటి విషయాలలో అధికారులు ఆచీతూచి అడిగేసి అప్రమత్తంగా వ్యవహరించి శాంతిభద్రలను కాపాడవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ వ్యవహారంలో ఒకవేళ చెవిరెడ్డి ప్రమేయం ఉంటే శాసనసభ్యులుగా తాను, మండల అభివృద్ధి అధికారిగా ఎంపీడీవో స్థానిక పోలీసులు పక్కకు ఉండగా క్షేత్రస్థాయిలో అడ్డుకొని ఫ్లెక్సీలను తొలగించటానికి తన సిబ్బందితో వెళ్ళిన పంచాయతీ ఈవో ఈ సంఘటనలో బలి పశువు అయ్యారు. విషయం తెలిసి చంద్రగిరికి విచ్చేసిన ఎంపీడీవో బాలజినాయక్ పరిస్థితులను సమీక్షించారు. టిడిపి నాయకులను కార్యాలయానికి రమ్మని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తాను తొలగించ మనలేదని శాంతి భద్రతలు దృశ్యా తానే ఏ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు ఉన్నా తొలగించమని తెలిపానని తెలిపారు. తర్వాత ఎవరితోనో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని చక్కబెట్టడంతో వివాదం సద్దుమణిగింది. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు పల్లినేని సుబ్రహ్మణ్యం నాయుడు, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌష్ బాషా, చంద్రగిరి మండల యువత అధ్యక్షులు రాజుల గారి వినోద్ రెడ్డి, నాయకులు రాజులు గారి అఖిల్ రెడ్డి, సక్కూరి ధనంజయ రెడ్డి, ప్రభాకర్ నాయుడు, యువ నాయకులు ఉన్నారు.

➡️