జగనన్న సమావేశ మందిరం ప్రారంభించిన… మంత్రి రోజా ‌.

జగనన్న సమావేశ మందిరం ప్రారంభించిన... మంత్రి రోజా ‌.

జగనన్న సమావేశ మందిరం ప్రారంభించిన… మంత్రి రోజా ‌. ‌ ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : పట్టణంలోని స్థానిక గోవిందమ్మ గుంట వద్ద తిరుపతి పట్టణ అభివృద్ధి సంస్థ నిధుల ద్వారా 43.00 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన జగనన్న సమావేశ మందిరము. రాష్ట్ర మంత్రి ఆర్ కె రోజా చేతులు మీదుగా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఇలాంటి ముఖ్యమంత్రి మళ్ళీ కావాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ‌ మున్సిపల్ కమిషనర్ కే ఎల్ ఎన్ రెడ్డి, మంత్రి భర్త ఆర్కే సెల్వమణి, మున్సిపల్ చైర్మన్ ఆనంగి హరి, వైస్ చైర్మన్ లు డి శంకర్. డి జయ ప్రకాష్, వైసిపి కార్యకర్తలు నాయకులు అభిమానులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ‌ ‌. ‌

➡️