జనసేన టికెట్‌ ఇస్తే పోటీ చేస్తా : సుగుణమ్మ

జనసేన టికెట్‌ ఇస్తే పోటీ చేస్తా : సుగుణమ్మ

జనసేన టికెట్‌ ఇస్తే పోటీ చేస్తా : సుగుణమ్మప్రజాశక్తి – తిరుపతి టౌన్‌తిరుపతి అసెంబ్లీ టిడిపి నుంచి పోటీ చేయాలని ఆశతో ఉన్నానని, అయితే బిజెపి జనసేన పొత్తులో భాగంగా టిడిపి తిరుపతి అసెంబ్లీ సీటు వదులుకోవాల్సి వచ్చిందని తిరుపతి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తెలిపారు. శనివారం అలిపిరి వద్ద టీడీపీ కార్యాలయంలో ఆత్మీయ సమావేశం జరిగింది. పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ టికెట్‌ జనసేనకు కేటాయించారని, జనసేన పార్టీ తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేయడానికి తను సిద్ధంగా ఉన్నానని ఘంటాపథంగా పేర్కొన్నారు. వైసిపి పాలనలో తిరుపతిలో జరుగుతున్న అరాచకాలకు తాను నిత్యం పోరాటం చేయడమే కాకుండా ప్రజలకు కష్టసుఖాల్లో అండగా ఉన్నానని చెప్పారు. వైసిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవాలంటే తనకు టికెట్‌ ఉంటే గట్టిగా ఓడిస్తానని సుగుణమ్మ తెలియజేశారు. తిరుపతి టికెట్టు జనసేన పార్టీకి తాను సమర్థవంతమైన అభ్యర్థి అని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి నియోజకవర్గ పరిశీలకులు చిట్టిబాబు, టిడిపి నాయకులు కష్ణ యాదవ్‌, దంపూరి భాస్కర్‌ యాదవ్‌, బుల్లెట్‌ రమణ పాల్గొన్నారు.

➡️