జర్నలిస్టు ఇళ్లస్థలాల భూమి గుర్తింపు వేగవంతం : కలెక్టర్‌

జర్నలిస్టు ఇళ్లస్థలాల భూమి గుర్తింపు వేగవంతం : కలెక్టర్‌

జర్నలిస్టు ఇళ్లస్థలాల భూమి గుర్తింపు వేగవంతం : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌జిల్లాలో అర్హులైన జర్నలిస్ట్‌ల ఇళ్ల స్థలాల కొరకు భూమిని గుర్తించే పనులను వేగవంతం చేయాలని సంబంధిత రెవెన్యూ అధికారులను జిల్లా కలెక్టర్‌ డా.జి. లక్ష్మీ శ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్డీవోలు, జిల్లా జర్నలిస్ట్‌ హౌసింగ్‌ కమిటీ సభ్యులతో, సంబంధిత అధికారులతో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన జర్నలిస్ట్‌ల ఇళ్ల స్థలాల కొరకు భూమిని గుర్తించి రానున్న శనివారం నాటికి నివేదికలు అందించాలని ఆర్డీఓలను ఆదేశించారు. జిల్లాలో కమిషనర్‌ సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాథమిక పరిశీలన పూర్తి అయి ఆన్లైన్లో అందుబాటులో ఉన్న 590 మంది జర్నలిస్టుల జాబితాను సంబంధిత రెవెన్యూ డివిజనల్‌, మండల రెవెన్యూ అధికారులు వారి లాగ్‌ ఇన్‌ నందు వెరిఫై చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల గుర్తింపు, కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో తిరుపతి శ్రీకాళహస్తి ఆర్డీవోలు నిశాంత్‌ రెడ్డి, రవిశంకర్‌ రెడ్డి, కమిటీ కన్వీనర్‌ సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాల కొండయ్య, జర్నలిస్ట్‌ హౌసింగ్‌ కమిటీ సభ్యులు శుక్లా, మోహన్‌ ప్రసాద్‌, లక్ష్మీ కాంత్‌ పాల్గొన్నారు.

➡️