జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా సయ్యద్‌

Dec 5,2023 21:34
జిల్లా క్రీడాభివృద్ధి అధికారిగా సయ్యద్‌

ప్రజాశక్తి-తిరుపతి సిటి: తిరుపతి జిల్లా క్రీడాభివృద్ధి అధి óకారిగా షేక్‌ సయ్యద్‌ సాహెబ్‌ నియామకం హర్షనీయమని జిల్లా ఒలంపిక్‌ అసోసియేషన్‌ అద్యక్షులు వై.ప్రవీణ్‌ హర్షం వ్యక్తం చేశారు. స్థానిక శ్రీనివాస స్పోర్ఠ్స్‌ కాంప్లెక్స్‌ వద్ద మంగళవారం ఆయన్ని కలిసిన ప్రవీణ్‌, దుశ్శాలవతో సత్కరి ంచారు. ఆయన మాట్లాడుతూ సయ్యద్‌ సాహెబ్‌ ఉమ్మడి చిత్తూరుజిల్లా ముఖ్య క్రీడా శిక్షకుడిగా, తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ పరిపాలనాధికారిగా అనేక సంవత్సరాల నుండి ఉత్తమ సేవలు అందించారని, క్రీడల అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డారని తెలిపారు. అటువంటి అధికారిని తిరుపతి జిల్లా స్పోర్ట్స్‌ అధికారిగా నియమించడం అభినందనీయమన్నారు. అనం తరం ఆయనని ఒలంపిక్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షులు డాక్టర్‌ వై.ప్రవీణ్‌, ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీధర్‌, కోశాధికారి జిఎస్‌ సాయికుమార్‌ ఘనంగా దుశ్శాలువలతో సత్కరించి పూల గుచ్చాన్ని అందించి అభినందించారు. కార్యక్రమంలో జిల్లా శాప్‌ శిక్షికులు ఆదినారాయణ, హిందూజా, సాయి సుమతి, నీలిమ, విజయమోహన్‌రెడ్డి, సూర్య, కళ పాల్గొన్నారు.

➡️