టిటిడి ఉద్యోగులు ఏ చింతలపాలెం శ్రీ ఇక్కడే 5,500 మందికి ఇంటి స్థలాలు శ్రీ రైతులకు రూ.87 కోట్లు చెల్లింపు

టిటిడి ఉద్యోగులు ఏ చింతలపాలెం శ్రీ ఇక్కడే 5,500 మందికి ఇంటి స్థలాలు శ్రీ రైతులకు రూ.87 కోట్లు చెల్లింపు

టిటిడి ఉద్యోగులు ఏ చింతలపాలెం శ్రీ ఇక్కడే 5,500 మందికి ఇంటి స్థలాలు శ్రీ రైతులకు రూ.87 కోట్లు చెల్లింపుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగుల సుదీర్ఘ పోరాట ఫలితంగా 5,500 మంది ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఏర్పేడు – వెంకటగిరి ప్రధాన రహదారి పక్కన చింతలపాలెం వద్ద ఇళ్లస్థలాలను కేటాయించారు. దాదాపు 3 కిలోమీటర్ల దూరం పొడవున రోడ్డు పక్కన స్థలాలను ఇచ్చేందుకు టిటిడి కసరత్తు చేస్తోంది. ఈ మేరకు యుద్ధప్రాతిపదికన చెట్టు పుట్ట జేసీబీలతో తొలగిస్తూ చదును చేస్తోంది. ఎన్నికల కోడ్‌ రాకముందే 5,500 మందికి స్థలాలను కేటాయిస్తూ ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు. ఎకరా 25 లక్షల చొప్పున 225 మంది రైతులకు రూ.87 కోట్లు నష్టపరిహారం చెల్లించారు. ఇంకా 27 మంది రైతులకు ఇవ్వాల్సి ఉంది. చెట్టు పుట్ట చదును చేసిన వెంటనే, సర్వే నిర్వహించి, ప్లాట్లు వేసి డిప్‌ ద్వారా వీరికి కేటాయించనున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు 2,223 మందికి, రిటైర్‌ అయిన వారికి 3,277 మందికి 50 అంకణాల చొప్పున ఇవ్వనున్నారు. ఈ స్థలం అభివృద్ధికి, రిజిస్ట్రేషన్‌కు కొంతమేర లబ్దిదారులు చెల్లించాల్సి ఉంది. తొలివిడతగా టిటిడి పర్మినెంట్‌ ఉద్యోగులకు వడమాలపేట మండలం పాదిరేడు వద్ద 5,192 మందికి ఇళ్లస్థలాలను ఇచ్చారు. రెండు, మూడో విడతలుగా చింతలపాలెం వద్ద కేటాయించారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు టిటిడి ఉద్యోగులు పోరాడిన ఫలితం ఇది.

➡️