టీడీపీలో గందరగోళం..!

టీడీపీలో గందరగోళం..!

టీడీపీలో గందరగోళం..!ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో సత్యవేడు నియోజకవర్గ స్థాయిలో అభిప్రాయసేకరణ లేకుండా అధిష్టానం తీసుకున్న నిర్ణయంపైహొ క్యాడర్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అనూహ్యంగా వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి టికెట్‌ కేటాయించడాన్ని క్యాడర్‌ జీర్ణించుకోలేకపోయింది. నమ్ముకున్న పార్టీకి పని చెయ్యాలా లేక వైసీపీ ప్రభుత్వంలో తమను ఇబ్బంది పెట్టిన కోనేటికి పనిచేయకుండా మిన్నకుండలా…అనే మిమాంసలో టీడీపీ క్యాడర్‌ ఉంది.టిడిపి కేడర్‌ను కలుపుకుపోయే పనిలో ఆదిమూలం జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించి టిడిపి అధిష్టానం తమను సంప్రదించకుండానే సత్యవేడు ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి టికెట్‌ కేటాయించడంపై నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో తమ అసంతప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.అభ్యర్థి మార్పుకి కారణాలేమిటి…! సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని అనూహ్యంగా మార్చడానికి గల కారణాలపై చాలా వాదనలే వినిపిస్తున్నాయి..! నాలుగున్నర సంవత్సరాలలో ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆశావహులు ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో, ప్రజలను, పార్టీ నాయకులను, కార్యకర్తలును కలుపుకు పోవడంలో విఫలం కావడమే కారణమా..? ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తన టికెట్‌ కేటాయింపుపై వైసీపీ అధిష్టానం ససేమిరా అనడంతో జిల్లాలో వైసీపీ పెద్దాయనగా పిలుచుకునే సాక్షాత్తు పెద్దిరెడ్డి పైనే ఆయన వ్యక్తిగత దూషణలతో అప్పటివరకు ఆదిమూలం వెనకాల ఉన్న నాయకులే ముందు ఉండి ఆయన దిష్టిబొమ్మ తగల పెట్టడంతో వచ్చిన సింపతీని హైప్‌ చేసుకుని, బలమైన లాబీయింగ్‌ వల్ల క్యాస్ట్‌ ఈక్వెషన్‌ సాకుతో అభ్యర్థి మార్పు జరిగినట్లు బలమైన వాదన ఉంది…?వడివడిగా ఆదిమూలం అడుగులు.. ఆఖరి నిమిషంలో టీడీపీలో టికెట్‌ తెచ్చుకున్న ప్రస్తుత వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, టీడీపీ నాయకులను, కార్యకర్తల మద్దతు కోసం ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా అటు టీడీపీ సీనియర్‌ నాయకులను కలుస్తూ ఇటు సోషల్‌ మీడియా ద్వారా ఆయన్ని విభేదిస్తున్న వారిని ఎప్పటికప్పుడు కలుస్తూ తనపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నంలో వడివడిగా అడుగులు వేస్తున్నారనే చెప్పాలి…భిన్నఅభిప్రాయలతో అయోమయంలో కార్యకర్తలు కోనేటి ఆదిమూలంకి టికెట్‌ కేటాయింపుఫై అధిష్టానం మీద కొంతమంది నాయకులు, కార్యకర్తలు బహిరంగానే విభేధిస్తుంటే… మరి కొంతమంది నాయకులు పార్టీ నిర్ణయమే శిరోధార్యం అంటూ, పార్టీ ఎవరికి టికెట్‌ ఇచ్చిన కష్టపడి గెలిపించుకుంటాం అంటున్నారు. కోనేటి ఆదిమూలంపై తమకు వ్యక్తిగత అభిప్రాయ బేధాలు లేనప్పటికి ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యేగా ఉన్నపుడు నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన పేరు చెప్పి ఆయా మండలాల్లో స్థానిక వైసీపీ నాయకులు… తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షసాదింపు చర్యలు చేపట్టారని అలాంటి వ్యకిని ఇప్పుడు భుజాలమీద మోయలేమని, జరిగిన పరిణామాలను అధిష్టానంకి వివరించి చివరి నిమిషం వరకు అభ్యర్థి మార్పు కోసం పోరాడుతామని, లేనిపక్షంలో స్పష్టమైన హామీ పొందిన తర్వాతే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఒక వర్గం తేల్చి చెబుతున్నారు.ఊహించని వ్యతిరేకత.. అభ్యర్థిని మార్చడంతో ఊహించని రీతిలో వచ్చిన వ్యక్తిరేకతతో అధిష్టానం రీ సర్వే చేయబోతుందన్న వార్త చెక్కర్లు కొడుతున్నప్పటికీ… ఆది నుండి టీడీపీకి కంచుకోటగా ఉన్న సత్యవేడు నియోజకవర్గాకి సంబంధించిన ఈసారి ఎన్నికలను ప్రతిష్టాకత్మంగానే తీసుకున్నప్పటికీ అభ్యర్థి మార్పుతో వస్తున్న వ్యతిరేకతను తగ్గిస్తూ బలమైన నాయకత్వంతో సత్యవేడు గడ్డపై తిరిగి టీడీపీ జెండా ఎగరావేయడానికి అధిష్టానం గట్టిగానే వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం..?

➡️