డాక్టర్‌ మహాదేవమ్మ సేవలు శ్లాఘనీయం వక్తల ప్రశంసలు

డాక్టర్‌ మహాదేవమ్మ సేవలు శ్లాఘనీయం వక్తల ప్రశంసలు

డాక్టర్‌ మహాదేవమ్మ సేవలు శ్లాఘనీయం వక్తల ప్రశంసలుప్రజాశక్తి – క్యాంపస్‌ :శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె. మహదేవమ్మ ఉద్యోగ విరమణ మహోత్సవం బుధవారం కళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య మహమ్మద్‌ హుస్సేన్‌, డీన్‌ ఆచార్య అప్పారావు, శ్రీ పద్మావతి కళాశాల విశ్రాంత తెలుగు అధ్యాపకులు డాక్టర్‌ డిఎమ్‌ ప్రేమావతి, తిరుమల తిరుపతి దేవస్థానం అకాడమిక్‌ చీఫ్‌ అడ్వైజర్‌ డాక్టర్‌ ఎల్‌ ఆర్‌ మోహన్‌ కుమార్‌ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానం ఇతర కళాశాలల అధ్యక్షులు, అధ్యాపకులు విచ్చేశారు. విద్యార్థి సంఘం ఇన్‌ఛార్జ్‌ డాక్టర్‌ టి భువనేశ్వరి ఉద్యోగ విరమణ చేస్తున్న డాక్టర్‌ కే. మహదేవమ్మ బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితం వివిధ రంగాలలో చేసిన కషి, సాధించిన విజయాలు, పొందిన పురస్కారాల గురించి వివరించారు. పద్మావతి కళాశాలే తన శ్వాసగా జీవిస్తున్న డాక్టర్‌ ప్రేమావతి మాట్లాడుతూ అతి ఎక్కువ కాలం ఈ కళాశాల ప్రిన్సిపాల్‌ గా కొనసాగిన వారిలో డాక్టర్‌ మహదేవమ్మ మూడవ వారని గుర్తు చేశారు. కళాశాల పేరును, వైభవాన్ని కాపాడటానికి తన శాయశక్తులా కషి చేశారని కొనియాడారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ ఆచార్య మహమ్మద్‌ హుస్సేన్‌- మహాదేవమ్మ ఆధ్వర్యంలో గతంలో కళాశాల నాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించడం, ఇప్పుడు అటానమస్‌ స్టేటస్‌ పొందడం గర్వించదగ్గ విషయమని చెబుతూ, అటానమస్‌ స్టేటస్‌ ఆర్డర్‌ కాపీని ప్రిన్సిపాల్‌ కు అందించారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం డీన్‌ ఆచార్య అప్పారావు – డాక్టర్‌ మహదేవమ్మ పరిపాలన దక్షత అందరికీ ఆదర్శమని తెలుపగా, డాక్టర్‌ ఎల్‌ ఆర్‌ మోహన్‌ కుమార్‌ రెడ్డి కళాశాల చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారని మహాదేవమ్మని ప్రశంసించారు. ఈ సందర్భంగా మరెందరో ప్రముఖులు డాక్టర్‌ మహదేవమ్మ వ్యక్తిత్వం, గొప్పతనం గురించి వారితో తనకున్న అనుబంధం గురించి ప్రస్తావించారు, అభినందనలతో, దుశ్శాలువాలుతో సత్కరించారు. కళాశాల మ్యాగజైన్‌ కమిటీ ఇన్చార్జి డాక్టర్‌ వి కష్ణవేణి, మ్యాగజైన్‌ కమిటీ సభ్యుల సమక్షంలో కళాశాల ప్రిన్సిపాల్‌ చేతుల మీదుగా కళాశాల మ్యాగజైన్‌ ఆవిష్కరించారు. చివరగా ఉద్యోగ విరమణ చేస్తున్న కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కె మహదేవమ్మ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం, ముఖ్యంగా సంయుక్త కార్య నిర్వహణ అధికారి సదా భార్గవి, విద్యాశాఖ అధికారి డాక్టర్‌ ఎం. భాస్కర్‌ రెడ్డి ఇంకా కళాశాల అధ్యాపక అధ్యాపక, అధ్యాపకేతరులు ఇచ్చిన సహకారంతోనే ఇన్ని విజయాలు సాధించగలిగానని చెబుతూ అందరికీ పేరుపేరునా సభాముఖంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకులు శ్రీరాములు, ప్రముఖ మిమిక్రీ కళాకారులు విజరు కుమార్‌, తిరుమల తిరుపతి దేవస్థానం మహిళా వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కు చెందిన ఇందిరా, కల్పన, హేమలత, అనురాధ, కళాశాల నాక్‌, అటానమస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ కే ఉమారాణి, సైకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ జి భద్రమణి, కళాశాల వసతి గహ వార్డెన్‌ డాక్టర్‌ విద్యుల్లత, కళాశాల విద్యార్థి సంఘ సభ్యులు, విద్యార్థినులు, అధ్యాపక, అధ్యాపకేతర బందం పాల్గొన్నారు.

➡️