డిఎంహెచ్‌ఓ ఆఫీసులో ‘గ్రీవెన్స్‌ డే

డిఎంహెచ్‌ఓ ఆఫీసులో ‘గ్రీవెన్స్‌ డే’ప్రజాశక్తి- తిరుపతి సిటీ తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖధికారి డాక్టర్‌ యు.శ్రీహరి ఆధ్వర్యంలో జిల్లా వైద్య శాఖధికారి కార్యాలయంలో కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్‌ ఆదేశాలమేరకు మంగళవారం గ్రీవెన్స్‌డే నిర్వహించారు. జిల్లాలో పనిచేసే ఉద్యోగులు తమ సమస్యలపై జిల్లా వైద్య శాఖాధికారిని వ్యక్తిగతంగా కలసి వినతిపత్రాలను అందజేశారు. జిల్లాస్థాయిలో 20మంది పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారని, వినతులన్నింటినీ విజయవాడ గొల్లపూడిలోని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయానికి పంపుతామని డిఎంహెచ్‌ఓ తెలిపారు.

➡️