తిరుపతి పుట్టినరోజు అందరి వేడుక

తిరుపతి పుట్టినరోజు అందరి వేడుక

తిరుపతి పుట్టినరోజు అందరి వేడుకప్రజాశక్తి – తిరుపతి సిటి ‘మన తిరుపతికి పుట్టినరోజు వేడుక అందరిదీ’ అని టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గోవిందరాజు స్వామి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ 894 సంవత్సరాల కిందట జగద్గురు శ్రీరామానుజాచార్యుల అమత హస్తాలతో ఈ ప్రాంతానికి శంకుస్థాపన జరిగిందన్నారు. చిదంబరం నుంచి తీసుకొచ్చిన గోవిందరాజస్వామి ప్రతిమను ప్రతిష్టించడంతోపాటు ఈ ప్రాంతానికి గోవిందరాజపురంగా నామకరణ చేశారన్నారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ తిరుపతి అభివద్ధికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. తిరుపతి నగరాన్ని కూడా తిరుమల తరహాలో సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఆధ్యాత్మిక వాతావరణంఉండాలన్న ఉద్దేశంతోనే తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా తిరుపతిని అభివద్ధి చేస్తున్నామన్నారు. తిరుపతి అభివద్ధికి అందరూ సహకరించాలని కోరారు. అనంతరం గోవిందరాజు స్వామి మాడవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎం ఎల్‌ సి డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, తిరుపతి మేయర్‌ డాక్టర్‌ శిరీష, డిప్యుటీ మేయర్లు భూమన అభినయ రెడ్డి, ముద్ర నారాయణ, పెద్ద జీయర్‌, చిన్న జీయర్‌ స్వామీజీలు పాల్గొన్నారు.

➡️