తిరుమల ఘాట్‌లో డ్రోన్‌ కలకలం

తిరుమల ఘాట్‌లో డ్రోన్‌ కలకలం

తిరుమల ఘాట్‌లో డ్రోన్‌ కలకలంప్రజాశక్తి – తిరుమలతిరుమలలో మరోసారి డ్రోన్‌ కెమెరా ఎగురవేత కలకలం సష్టించింది. తిరుమలలోని ఘాట్‌రోడ్డులో 53వ మలుపు వద్ద అసోం ఆర్మీ కమాండర్‌ కుటుంబం డ్రోన్‌ కెమెరాతో పరిసరాలను చిత్రీకరించడం వివాదాస్పదమయ్యింది. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్‌ అధికారులు డ్రోన్‌ కెమెరాను స్వాధీనం చేసుకుని భక్తులను విచారిస్తున్నారు. తిరుమలలో, పరిసర ప్రాంతాల్లో నో ఫ్లయింగ్‌ జోన్‌ ఉండడం వల్ల విమానాలుగాని, డ్రోన్‌ కెమెరాలను వాడడం నిషేదం. శ్రీవారి ఆలయం పై నుంచి విమానాలు ఎగురడంపై గతంలో పలుమార్లు విమానయాన శాఖ అధికారులకు ఫిర్యాదులు చేసి విమానాలు అటువైపు రాకుండా అడ్డుకున్నారు. ఈ ఘటనలో భక్తులు చిత్రీకరించిన వీడియోలను తొలగించి పంపినట్టు సమాచారం.

➡️