తుడ విసి గా వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరణ

తుడ విసి గా వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరణ

తుడ విసి గా వెంకటనారాయణ బాధ్యతలు స్వీకరణప్రజాశక్తి -తిరుపతి టౌన్‌తిరుపతి అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ వైస్‌ చైర్మన్‌ గా వెంకటనారాయణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ వీసీగా ఉన్న హరికష్ణ టీటీడీకి బదిలీ అయ్యారు. విసిగా బాధ్యతలు చేపట్టిన వెంకటనారాయణ తుడాలో సెక్రటరీగా పనిచేసేవారు. రాష్ట్ర ప్రభుత్వము వెంకటనారాయణను తుడా విసి గా నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో వి సీ గా బాధ్యతలు తీసుకున్నారు. తుడా పరిధిలో ఉండే అన్ని గ్రామాల అభివద్ధికి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు.

➡️