దళిత గిరిజనులపై ఫారెస్ట్‌, పోలీసుల దౌర్జన్యం ఆపాలి

దళిత గిరిజనులపై ఫారెస్ట్‌, పోలీసుల దౌర్జన్యం ఆపాలి

దళిత గిరిజనులపై ఫారెస్ట్‌, పోలీసుల దౌర్జన్యం ఆపాలిప్రజాశక్తి – వెంకటగిరి రూరల్‌ దళిత గిరిజనులపై ఫారెస్టు, పోలీసుల దౌర్జన్యం ఆపాలని సిపిఎం నాయకులు వడ్డిపల్లి చెంగయ్య విజ్ఞప్తి చేశారు. దళిత గిరిజనులకు 2 ఎకరాల చొప్పున భూపంపిణీ చేసి, వారు రెండు పూటలా అన్నం తినేందుకు అధికారులు సహకరించాల్నఆ్నరు. శనివారం పెట్లూరు గ్రామ భూసాధన పోరాట కమిటి ఆధ్వర్యంలో సర్వే నంబర్‌ 12(1)లో ఉన్న 519 ఎకరాల మేత పోరంబోకు ప్రభుత్వ భూమిని దళిత గిరిజన పేదలు ఆక్రమించుకుని చెట్టు పుట్ట కొట్టి సాగుకు సిద్ధం చేశారు. అయితే పొలం పనులు చేసుకుంటున్న దళిత గిరిజన పేదలపై పోలీసులు, ఫారెస్టు అధికారులు దౌర్జన్యం చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. వడ్డిపల్లి చెంగయ్య మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా ఫారెస్టు వారు దళిత గిరిజన పేదలను అడుగడుగునా అడ్డుకుంటూ ఉన్నారన్నారు. సర్వే నంబర్‌ 12(1) రిజర్వు ఫారెస్టు అని ఫారెస్టు వారు అడ్డుకుంటున్నారని, అయితే అది రిజర్వు ఫారెస్టు అయితే ఇదే సర్వే నంబర్‌లో జగనన్న కాలనీ ఎలా నిర్మించాలని, ఎలా పట్టాలిచ్చారని ప్రశ్నించారు. దళిత గిరిజనులపై దౌర్జన్యానికి దిగిన పోలీసు, ఫారెస్టు, రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పేదలకు భూములు పంచాలని డిమాండ్‌చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోపాలయ్య, రమణయ్య, గురవయ్య, కోటేశ్వరరావు, వెంకట రమణయ్య, రేణుక పాల్గొన్నారు.

➡️