దొంగ ఓట్ల కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి : ఆరణి

దొంగ ఓట్ల కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి : ఆరణి

దొంగ ఓట్ల కేసు దర్యాప్తు వేగవంతం చేయాలి : ఆరణిప్రజాశక్తి -తిరుపతి టౌన్‌తిరుపతి నియోజకవర్గంలో నమోదైన దొంగ ఓట్ల వ్యవహారంపై విచారణ వేగవంతం చేయాలని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు (జేఎంసి) కోరారు. నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిణి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అయిన అదితి సింగ్‌ ను ఆరణి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్‌ లు కలిశారు. ఈ సందర్భంగా దొంగ ఓట్ల వ్యవహారంపై దర్యాప్తు వెంటనే పూర్తి చేయాలని రిటర్నింగ్‌ అధికారిణిని వారు కోరారు. ఈ వ్యవహారంలో సూత్రధారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే దొంగ ఓట్ల వ్యవహారంకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిపేలా చూడాలన్నారు. దొంగ ఓట్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోందని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అదితి సింగ్‌ వారికి తెలిపారు.

➡️