నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల జెఎసి నిరసన

నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల జెఎసి నిరసన

నల్లబ్యాడ్జీలతో ఉద్యోగుల జెఎసి నిరసనప్రజాశక్తి – రామచంద్రాపురం/చంద్రగిరిఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన వివిధ రకాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. బుధవారం అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు భోజన విరామ సమయంలో చంద్రగిరి, రామచంద్రపురం తహసిల్దార్‌ కార్యాలయాల ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ 12వ పి ఆర్‌ సి లో మధ్యంతర భతి (ఐ.ఆర్‌) 30శాతం తక్షణమే చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న రెండు కొత్త డి.ఏ లు తక్షణమే విడుదల చేయాలన్నారు. టీచర్ల అప్రంటిస్‌ విధానం రద్దుచేయాలన్నారు.పాకాలలో.. పెన్షనర్‌ అసోసియేషన్‌ సంఘం నాయకులు నల్లబ్యాడ్జీలతో ప్రభుత్వ పాఠశాల వద్ద నిరసన తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహ్మద్‌ రఫీ, కొండారెడ్డి జయచంద్ర, బహుజన టీచర్‌ అసోసియేషన్‌ గౌరవ సలహాదారు ఆంజనేయులు పాల్గొన్నారు.

➡️