నిబద్ధతతో పని చేసే వారికే గౌరవం

నిబద్ధతతో పని చేసే వారికే గౌరవం

నిబద్ధతతో పని చేసే వారికే గౌరవంప్రజాశక్తి-శ్రీకాళహస్తి: వత్తిపట్ల నిబద్ధతతో ఉత్తమ సేవలందించే ఉద్యోగులకు సర్వత్రా గౌరవ లభిస్తుందని శ్రీకాళహస్తి మండల విద్యాశాఖాధికారి భువనేశ్వరి అన్నారు. శ్రీకాళహస్తి మండలం వేడాం ఉన్నత పాఠశాల్లో జరిగిన ప్రధానోపాధ్యాయులు గురునాథం, తెలుగు ఉపాధ్యాయులు గోపి పదవీ విరమణ సన్మానసభకు ఆమె విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా గురునాథం విద్యాశాఖకు చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటూ ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన భవిష్యత్తు ఉపాధ్యాయులకు మార్గదర్శకులుగా ఆమె అభివర్ణించారు. ఈ సందర్భంగా ఎంఈవో, కార్యాలయ సిబ్బందితో కలిసి గురునాథం, గోపిలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు బాలయ్య, నాగేశ్వర రావు, లక్ష్మీపతి, సీఅర్‌ఎంటీలు హేమలత, మునిమోహన్‌, స్వప్న, శాంతి, దేవీప్రియ, ఎంఈవో కార్యాలయ సిబ్బంది మాధవయ్య, లలిత, ప్రశాంత్‌, పలువిని ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️