నిరవధిక సమ్మెలోకి వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు

నిరవధిక సమ్మెలోకి వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు

నిరవధిక సమ్మెలోకి వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు ప్రజాశక్తి – క్యాంపస్‌ (ఎస్వీయూ) తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి శుక్రవారం నుంచి తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టారు. దీక్షా శిబిరం వద్ద సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఉపాధ్యక్షులు వందవాసి నాగరాజు, జయచంద్ర మాట్లాడుతూ గత 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం అమలు చేయడం లేదని, సుప్రీం తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం, టైంస్కేలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆప్కాస్‌ ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గండికోట చిన్నబాబు, టైంస్కేల్‌ ఉద్యోగ సంఘం నాయకులు మురళి, యూనియన్‌ అధ్యక్షురాలు వరలక్ష్మి, కార్యదర్శి రాకేష్‌, నాయకులు సుబ్బు, రేవతి, చంద్రమ్మ, అనురాధ, మునిలక్ష్మి, రమ, మురళి పాల్గొన్నారు.

➡️