నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం

నిషేధిత భూములకు రిజిస్ట్రేషన్లు ప్రారంభంప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: 22ఏ కింద నిషేద భూములకు రిజిస్ట్రేషన్‌ చేయించే ప్రకియ ప్రారంభమైందని తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ భూమన అభినరురెడ్డి తెలిపారు. 22ఏ కింద తిరుపతిలోని తాతయ్యగుంట కట్ట భూములను రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారికి సోమవారం డిప్యూటీ మేయర్‌ భూమన అభినరు రెడ్డి సాక్షి సంతకం చేసి వారికి పత్రాలను అందచేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టిడిపి ప్రభుత్వం నిషేధిత భూములను రిజిస్ట్రేషన్‌ చేయిస్తానని చెప్పి మోసం చేసిందని గుర్తు చేస్తూ, నేడు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చేయూతతో నిషేధిత భూముల రిజిస్ట్రేషన్‌ ప్రకియ ప్రారంభమైందన్నారు. నేడు తాతయ్యగుంట కట్టకు సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్‌ ప్రకియ జరుగుతున్నదని, ఇప్పుడు చేయించే రిజిస్ట్రేషన్‌ పత్రాలనే మూలపత్రాలుగా గుర్తించడం జరుగుతుందన్నారు. ప్రజల్లో అపోహలు సష్టించి రిజిస్ట్రేషన్‌లు చేయరు అదంతా ఉత్తి మాటలని టిడిపి నమ్మించే ప్రయత్నం చేసిందని, ఆ అపోహలు తొలగిస్తూ రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్‌ దొడ్డారెడ్డి ప్రవల్లికారెడ్డి, నాయకులు దొడ్డారెడ్డి మునిశేఖర్‌రెడ్డి, టౌన్‌బ్యాంక్‌ వైస్‌చైర్మెన్‌ వాసు యాదవ్‌ పాల్గొన్నారు.

➡️