నేడు వైకుంఠ ఏకాదశి

నేడు వైకుంఠ ఏకాదశి

నేడు వైకుంఠ ఏకాదశిప్రజాశక్తి – తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం వైకుంఠ ఏకాదశి, ఆదివారం వైకుంఠ ద్వాదశి సందర్భంగా భక్తులతో పోటెత్తింది. శుక్రవారం మద్యాహ్నం నుంచి తిరుపతిలో తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రారంభించారు. 23నుంచి జనవరి 1వ తేదీ వరకు పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు, డిసెంబర్‌ 31న, జనవరి 1 తేదీల్లో శ్రీవారి ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రమ్మోత్సవ సేవలను టిటిడి రద్దుచేసింది. సహస్ర దీపాలంకార సేవను ఏకాంతంగా నిర్వహిస్తారు. పది రోజుల పాటు ఇతర ఆర్జిత సేవలను ఏకాంతంగా చేస్తారు. గతంలో వలెనే ఈ ఏడాదీ స్వయంగా వచ్చే ప్రోటోకాల్‌ విఐపిలకు, కుటుంబసభ్యులకు పరిమిత సంఖ్యలో మాత్రమే బ్రేక్‌ దర్శనం కల్పించనున్నారు. పది రోజు పాటు సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టిటిడి పేర్కొంది. వైకుంఠ ద్వార దర్శనానికి పెరిగిన రద్దీతిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు భారీగా చేరుకున్నారు .శ్రీవారి సర్వదర్శనానికి పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారు. శనివారం రోజున వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2, నారాయణ గిరి షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్‌ నారాయణగిరి అతిథి గహం వరకు చేరుకుంది. దీంతో వైకుంఠద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టోకెన్లు లేని వారిని దర్శనానికి అనుమతించడం లేదు. ఇప్పటికే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేసి విక్రయించేసింది.సమన్వయంతో సేవలందించండి : జేఈవో తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 23 నుంచి జనవరి ఒకటో తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి సమన్వయంతో భక్తులకు సేవలు అందించాలని డెప్యుటేషన్‌ సిబ్బందికి టీటీడీ జేఈవో వీరబ్రహ్మం సూచించారు. తిరుమల వైభోత్సవ మండపంలో గురువారం సాయంత్రం డెప్యుటేషన్‌ సిబ్బందితో జేఈవో సమావేశం నిర్వహించారు. జేఈవో మాట్లాడుతూ ఈ విశేష ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అనుసరించిన ప్రణాళికను తెలియజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పర్యవేక్షక అధికారులకు సూచించారు. తిరుమలలో స్థానికుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో వారి ఆధార్‌ కార్డులో తిరుమల అడ్రసును పరిశీలించిన అనంతరం ఉచితంగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామన్నారు.

➡️