పంట పొలాలపై ఏనుగుల దాడిప్రజాశక్తి -రామచంద్రపురం ( చంద్రగిరి):

పంట పొలాలపై ఏనుగుల దాడిప్రజాశక్తి -రామచంద్రపురం ( చంద్రగిరి):

పంట పొలాలపై ఏనుగుల దాడిప్రజాశక్తి -రామచంద్రపురం ( చంద్రగిరి): మండలంలోని శేషాపురం, చిన్న రామాపురం గ్రామాలలోని పంట పొలాలను ఏనుగుల గుంపు ధ్వంసం చేశాయి. శేషాచలం అడవుల్లోని భాకరాపేట అటవీ ప్రాంతం నుండి ఏనుగుల గుంపు 20 రోజుల క్రితం వచ్చాయి. సోమవారం శేషాపురానికి చెందిన సంపూర్ణమ్మ, నాగేశ్వరరావు పొలాలలోని పంటలను ధ్వంసం చేశాయి. చెన్నకేశవులకు చెందిన 14 మామిడి చెట్లు, అరటి చెట్లను ధ్వంసం చేశాయి. చిన్న రామాపురం గ్రామంలో షాజహాన్‌ కు చెందిన రెండు ఎకరాలలో కొబ్బరి, మామిడి, అరటి చెట్లను ధ్వంసం చేయడమే కాకుండా పొలానికి వేసిన ఇనుప కంచను కూడా ధ్వంసం చేశాయి. సోమవారం రాత్రి సుమారు 13 ఏనుగులు పొలాల్లోకి ప్రవేశించి భీకరంగా అరుపులు అరుస్తూ డ్రిప్‌ ఇరిగేషన్‌ పైపులను, జొన్న గడ్డిని ధ్వంసం చేశాయి. ఏనుగుల భీకరమైన అరుపులకు రైతులు భయపడిపోయామని వాపోయారు. రైతులు అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అటవీ శాఖ అధికారులు మంగళవారం పొలాల వద్ద రాత్రి వేళల్లో బాణాసంచాలు పిలుస్తూ, డప్పులు వాయిస్తూ ఏనుగులను బెదిరించి కళ్యాణి డ్యాం అటవీ ప్రాంతం వైపు మళ్లీ ఇస్తామని రైతులకు భరోసా ఇచ్చారు. దీంతో గ్రామంలోని రైతులు ఊపిరి పీల్చుకున్నారు.

➡️