పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ : కలెక్టర్‌

పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ : కలెక్టర్‌

పకడ్బందీగా ఎన్నికల ప్రక్రియ : కలెక్టర్‌ప్రజాశక్తి-శ్రీకాళహస్తి సార్వత్రిక ఎన్నికల-2024 ఏర్పాట్లు పగడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్‌ లక్ష్మి శ పోలింగ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పట్టణంలోని స్కిట్‌ కళాశాలలో స్ట్రాంగ్‌ రూమ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలోని 95, 96, 97 పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. తదనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో అధికారులు బాధ్యతగా వారి విధులపై పూర్తిస్థాయి అవగాహనతో పనిచేయాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌, డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ లో అన్ని ఏర్పాట్లును పూర్తి చేయాలని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాలకు తరలించే ఈ వీ ఎంలు, వీ వీ ప్యాట్‌ లు భద్రపరిచే స్ట్రాంగ్‌ రూములు, అక్కడ నుంచి కౌంటింగ్‌ కేంద్రాలకు వెళ్లే రూట్‌ మ్యాప్‌ భద్రత అంశం దష్టిలో పెట్టుకొని తగు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. శ్రీకాళహస్తి ఈఆర్‌ఓ ఆర్డీఓ రవి శంకర్‌ రెడ్డి, తల్డాశీల్దార్‌ జనార్దన్‌ రాజు, బి ఎల్‌ వోలు పాల్గొన్నారు.

➡️