పది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

పది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌

పది మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్‌ప్రజాశక్తి-తిరుపతి(మంగళం): శేషాచలం అడవుల నుండి అక్రమంగా ఎర్రచందనం దుంగలను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని బడా స్మగ్లర్లకు చేరవేస్తున్న పది మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు టాస్క్‌ ఫోర్స్‌ ఎస్‌పి చక్రవర్తి తెలిపారు. తిరుపతి నగర పరిధిలోని కపిల తీర్థం వద్దగల టాస్క్‌ ఫోర్సు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తమిళనాడు తిరుపత్తూరు జిల్లాకు చెందిన ప్రధాన సూత్రధారి బాబు ఎర్రచందనం అక్రమ రవాణా కోసం మేస్త్రీలతో మాట్లాడుకుని కూలీలను, వాహనాలను సమకూర్చుకొని శేషాచలం అడవుల నుండి అక్రమంగా దాటిస్తున్నారన్నారు. టాస్క్‌ ఫోర్సు యథావిధులలో భాగంగా డీఎస్పీలు చెంచుబాబు, మురళీధర్‌, పర్యవేక్షణలో సురేష్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలోని ఆర్‌ఎస్‌ఐలు విష్ణువర్ధన్‌ కుమార్‌, సురేష్‌ బాబు, విశ్వనాథ్‌, వినోద్‌ కుమార్‌ టాస్క్‌ ఫోర్స్‌ విధుల్లో భాగంగా భాకరాపేట, ఎర్రావారి పాలెం సమీపంలో ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు పరిశీలిస్తుండగా బాకరాపేట రేంజ్‌ పరిధిలోని ముష్టికాయలు పంట గ్రామానికి సమీపంలో కొంతమంది వాహనంలో ఎర్రచందనం దుంగలను లోడ్‌ చేస్తూ కనిపించా రన్నా రు. వెంటనే వారిని చుట్టు ముట్టి బాబు, కన్న దాసన్‌ కాళీ, కమల కన్నన్‌ కాళీ, జ్ఞాన శేఖరన్‌, అజిత్‌, రామకష్ణన్‌ రామన్‌, కాలి పేచి నడుకాలి, విజరు కుమార్‌, జయప్రకాష్‌, ప్రకాశం గోవిందన్‌ లను అరెస్టు చేశా మన్నారు. అరెస్టు అయిన వారిలో ప్రధాన సూత్రధారి బాబుపై ఇప్పటికే మూడు జిల్లాల పరిధిలో 13 కేసులు ఉన్నాయన్నారు. ఈ కేసుకు సంబంధించి మరి కొంత మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తామన్నారు. వీరి నుంచి 306 కేజీల పది ఎర్రచందనం దుంగలు, రెండు కార్లు, ఒక మోటార్‌ సైకిల్‌ ను స్వాధీనం చేసుకున్నామన్నారు.

➡️