పస్తులతో వున్నాం.. ఆదుకోండి..తుపాను బాధితుల నిరసన

పస్తులతో వున్నాం.. ఆదుకోండి..తుపాను బాధితుల నిరసన

పస్తులతో వున్నాం.. ఆదుకోండి..తుపాను బాధితుల నిరసనప్రజాశక్తి – బాలాయపల్లి : తుపాన్‌ వల్ల నష్టపోతే ఇంతవరకు తమకు ఆర్థిక సాయం అందించలేదని మండలంలోని జయం పు గ్రామస్తులు సోమవారం తహ శీల్దార్‌ కార్యా లయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ తుపాన్‌ కారణంగా తమ ఇళ్లన్నీ కురిసి మూడు రోజులు పాటు పస్తులు ఉన్నామని చెప్పారు. ప్రభు త్వం అధికారులు తుపాను నష్టం జరిగిన వారికి ఆర్థిక సాయం అందించకుండా బడా బాబులకు ఆర్థిక సాయం అందిం చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. దళితవాడలో నీళ్లు వచ్చి అస్తవ్యస్తమైతే రెవెన్యూ అధికారులు పట్టించు కోలేదని ఆవేదనద వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. అనంతరం తహశీల్దార్‌ కు వినతిప త్రం అందించారు.

➡️