పాకాలలో మనుధర్మశాస్త్రం దహనం

పాకాలలో మనుధర్మశాస్త్రం దహనం

పాకాలలో మనుధర్మశాస్త్రం దహనంప్రజాశక్తి – పాకాలభారత రాజ్యాంగ అమలు కొరకై ప్రతి ఒక్కరూ కషి చేయాలని స్థానిక అంబేద్కర్‌ భవన అధ్యక్షులు గుండ్లపల్లి ఆంజనేయులు అన్నారు. స్థానిక అంబేద్కర్‌ భవన్‌ ఆధ్వర్యంలో సోమవారం మనుధర్మశాస్త్ర దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాకాల అంబేద్కర్‌ భవన్‌ ఆధ్వర్యంలో మను ధర్మ దహన సభ జరిగిందనానరు. అసమానతలకు, అన్యాయానికి, అంటరానితనానికి, వివక్షకు ప్రతిరూపమైన మను ధర్మ శాస్త్రాన్ని ఆనాడు బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 1927 డిసెంబర్‌ 25న కాల్చి వేయడం జరిగిందన్నారు. అంబేద్కర్‌ వారసులుగా మనం నేడు మను స్మతికి వ్యతిరేకంగా నడుచుకోవాలని, భారత రాజ్యాంగాన్ని ఆమోదించి వాటిని అమలుకైకషి చేయాలని అన్నారు. కార్యదర్శి డి.యర్‌ గణేష్‌ మాట్లాడుతూ మనుస్మతిలోనే మన జీవితం మొత్తం నిండి ఉన్నదని నమ్మడం వల్ల మనం నష్టపోతున్నామని అలాంటివి విడనాడాలని అన్నారు. బౌద్ధమే మనలో జ్ఞానం, దయ, ప్రేమ, జాలి, కరుణ ఉన్నాయని అలాంటి వాటిని మన జీవన ధర్మంగా నమ్మాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మొగులయ్య, కార్యవర్గ సభ్యులు శ్రీ బాబ్జి, ఎం ప్రభు, శ్రీరాములు, శివగారు నాగరాజా, రమణ, రామచంద్ర, బాలసుబ్రమణ్యం, శ్రీనివాసులు పాల్గొన్నారు.

➡️