పోణకా దేవసేనమ్మని కలిసిన కమిషనర్‌

పోణకా దేవసేనమ్మని కలిసిన కమిషనర్‌

పోణకా దేవసేనమ్మని కలిసిన కమిషనర్‌ప్రజాశక్తి – గూడూరు టౌన్‌: ఎన్నికల వేళ బదిలీల పరంపర కొనసాగుతోంది ..అన్నీ శాఖల అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పురపాలక కమిషనర్‌ అన్నవరం వెంకటేశ్వర్లు బదిలీపై వచ్చారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పురపాలక సంఘంలో పనిచేస్తున్న ఆయన గూడూరులో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు గూడూరులో బాధ్యతలు నిర్వహించిన వెంకటేశ్వర్లు అనంతపురం నగర పాలక సంస్థ ఉప కమిషనర్‌గా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో గూడూరు కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అన్నవరం వెంకటేశ్వర్లు స్థానికంగా నివాసం వుంటున్న స్వచ్ఛ ఆంధ్ర సంస్థ ఛైర్‌ పర్సన్‌ పొనకా దేవసేనమ్మను కలిసి మొక్కను అందించి అభినంద నలు తెలిపారు. అనంతరం వారు పలు అంశాలపై చర్చిం చారు.

➡️