ప్రజాస్వామ్య పార్లమెంట్‌కు వీడ్కోలు : గల్లా జయదేవ్‌

ప్రజాస్వామ్య పార్లమెంట్‌కు వీడ్కోలు : గల్లా జయదేవ్‌

ప్రజాస్వామ్య పార్లమెంట్‌కు వీడ్కోలు : గల్లా జయదేవ్‌ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో తన కుటుంబానికి యాభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందని, ప్రజల కోసం పోరాడే వారసత్వం ఉన్న కుటుంబం నుంచి వచ్చానని, తన తాత రాజగోపాల్‌నాయుడు స్వాతంత్య్ర పోరాటం చేసిన వ్యక్తని, తన గురువు ఎన్జీ రంగా స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చానని గుంటూరు ఎంపి గల్లా జయదేవ్‌ అన్నారు. పార్లమెంట్‌ ఉభయ సభలనుఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ప్రజాస్వామ్య పార్లమెంట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించారు. వివిధ కారణాల వల్ల తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని, ప్రజాజీవితంలో ఉండి పారిశ్రామికవేత్తగా కొనసాగడం అంత సులభం కాదని, తాను రాజకీయ జీవితానికి విరామం ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉన్నా, దేశానికి సేవ చేయాలనే నిబ్ధద్దతతో ఉన్నానన్నారు. ప్రధాని మోడీ నాయకత్వాన్ని, దేశం పట్ల విజన్‌ను అభినందిస్తున్నానని చెప్పారు. చంద్రయాన్‌ 3, అటల్‌ సేతు నిర్మాణం, ఆర్టికల్‌ 370 తొలగింపు, త్రిపుల్‌ తలాక్‌, మైనార్టీలకు పౌరసత్వం, పిఎం కిసాన్‌, పిఎం ఫసల్‌ బీమా యోజన ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని ఉటంకించారు. అమరావతి అభివృద్ధికి 1500 కోట్లు, గుంటూరు భూగర్భడ్రైనేజి వ్యవస్థకు వెయ్యి కోట్లు నిధులు సాధించానన్నారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో 20వేల గృహాలు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ఎపి పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. తాను పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించగలిగినప్పుడు తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు.

➡️