ప్రతి ఇంటా ఆనందం విలసిల్లాలి : కలెక్టర్‌

ప్రతి ఇంటా ఆనందం విలసిల్లాలి : కలెక్టర్‌

ప్రతి ఇంటా ఆనందం విలసిల్లాలి : కలెక్టర్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ కలెక్టర్‌ బంగ్లాలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. 2024 నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కె వెంకటరమణ రెడ్డి, డి ఆర్‌ ఓ పెంచల కిషోర్‌, కలెక్టరేట్‌ సిబ్బంది, జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్‌ బంగ్లా లో కేక్‌ కట్‌ చేశారు. జెసి శుభం బన్సల్‌, ఎస్పీ పరమేశ్వర రెడ్డి, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్‌ హరిత కలెక్టర్‌ను కలిసి పుష్ప గుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మాట్లాడుతూ అధికారులు ఇనుమడించిన ఉత్సాహంతో జిల్లాను అభివద్ధి పథంలో నడిపించుట లో భాగస్వాములు కావాలని తెలిపారు. ఆర్డీవోలు నిషాంత్‌ రెడ్డి, రవిశంకర్‌ రెడ్డి, చంద్రముని, ఎస్డిసి లు కోదండ రామిరెడ్డి, శ్రీనివాస రావు, భాస్కర్‌ నాయుడు, సిపిఓ ప్రేమ్‌ చంద్ర, పిడి డ్వామా శ్రీనివాస రావు, డి ఆర్డి ఏ పిడి జ్యోతి, డీపీఓ ప్రభాకర్‌ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ ప్రతాప్‌ రెడ్డి, సమాచార శాఖ డిఐపిఆర్‌ఓ బాల కొండయ్య, ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ అధికారులు చెన్నయ్య, భాస్కర్‌ రెడ్డి, సూర్యనారాయణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద రావు , శ్రీసిటీ రామ చంద్ర రెడ్డి, డి ఈ ఓ శేఖర్‌, జిల్లా గహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.

➡️