ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: సిపిఎం

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: సిపిఎం

ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి: సిపిఎంప్రజాశక్తి – గూడూరు టౌన్‌: మీచౌంగ్‌ తుపాను వలన గూడూరు మండల పరిధిలోని గ్రామాల్లో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్‌ చేశారు. సోమవారం గూడూరు పట్టణంలోని సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ రైతులు, కౌలు రైతులు వేసిన వరి నారు ఇటీవల వచ్చిన తుపాను వలన కొట్టుకుపోవడం జరిగిందని,పొలాలుల్లో వరద వలన ఇసుక వచ్చి చేరిందన్నారు. ప్రతి రైతు సుమారు రూ.10 నుండి 25 వేలు వరకు నష్టపోవడం జరిగిందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు ఉచితంగా వరి విత్తనాలు నష్ట పరిహారాన్ని చెల్లించాలన్నారు. సీపీఎం సెంట్రల్‌ శాఖా కార్యదర్శి జోగి శివకుమార్‌ మాట్లడుతూ ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బివి.రమణయ్య, సురేష్‌, బి.చంద్రయ్య, ఆడపాల ప్రసాద్‌, పామంజీ మణి, గుర్రం రమణయ్య, పాల్గొన్నారు. అదేవిధంగా గూడూరు పట్టణంలోని శ్రామిక్‌నగర్‌లో నివసిస్తున్న 24 కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం అందలేదని ఇకనైనా అధికారులు స్పందించి బాధితులకు సహాయం అందించాలని. శ్రామిక నగర్‌ వాసులతో కలిసి సీపీఎం పార్టీ నాయకులు ఆర్డీవో కిరణ్‌కుమార్‌కి వినతిపత్రం అందజేశారు.

➡️