ప్రశాంత ఎన్నికలకు ముందస్తు చర్యలు: ఎస్‌ఐ

ప్రశాంత ఎన్నికలకు ముందస్తు చర్యలు: ఎస్‌ఐ

ప్రశాంత ఎన్నికలకు ముందస్తు చర్యలు: ఎస్‌ఐప్రజాశక్తి – గూడూరు టౌన్‌ : గూడూరు మండల పరిధిలో సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో నిర్వ హిం చేందుకు ముందస్తు చర్యలు తీసు కుంటున్నామని ఇందులో భాగంగానే గూడూరు మండలంలో పలు గ్రామాలలో పోలింగ్‌ కేంద్రా లను పరిశీలించామని గూడూరు రూరల్‌ ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌ పేర్కొన్నారు. గూడూరు మండల పరిధిలోని వేములపాలెం రాములపాలెం గ్రామాలలోని పోలింగ్‌ కేంద్రాలను ఎస్‌ఐ మనోజ్‌ కుమార్‌ మంగళవారం తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ అతి త్వరలో ఎన్నికలు రానున్న దష్ట్యా జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలోని సమస్యాత్మక మైన పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించామన్నారు. పోలింగ్‌ కేంద్రాలలో అన్ని వసతులు ఉన్నాయా? లేవా? అని పోలింగ్‌ కేంద్రాలకు కాంపౌండ్‌ వాల్‌ తో పాటు ర్యాంపుల వంటివి ఉన్నాయా..లేవా? అని పరిశీలించడంతో పాటు ఏ పోలింగ్‌ కేంద్రాల వద్ద గొడవలు వంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి?’ అనే వాటిని పరిశీలించామని పేర్కొన్నారు.

➡️