బాలుని కిడ్నాప్‌ కథ సుఖాంతంతల్లిదండ్రులకు అప్పగించిన ఎస్‌పి

బాలుని కిడ్నాప్‌ కథ సుఖాంతంతల్లిదండ్రులకు అప్పగించిన ఎస్‌పి

బాలుని కిడ్నాప్‌ కథ సుఖాంతంతల్లిదండ్రులకు అప్పగించిన ఎస్‌పిప్రజాశక్తి -తిరుపతి సిటీ తిరుమలలో ఆదివారం కిడ్నాప్‌కు గురైన బాలుడు అభినరు (3) కేసును పోలీసులు మూడు గంటల్లోనే ఛేదించి బాలుని తల్లిదండ్రులకు అప్పగించి శభాష్‌ అనిపించుకున్నారు. ఈ ఘటన సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కష్ణ కాంత్‌ పటేల్‌ సోమవారం మీడియాకు వివరించారు. స్థానిక పోలీస్‌ గెస్ట్‌ హౌస్‌ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం గద్వాల జిల్లా నుంచి శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులు 10 మంది కలసి తిరుమలకు కాలినడకన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారు. మగవారు రూముల రిజిస్ట్రేషన్‌కు వెళ్లగా, ఆడవారు నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని మహిళ పిల్లవానికి సెల్‌ఫోన్‌ ఇచ్చి ఏమార్చి కిడ్నాప్‌ చేసింది. ఎస్‌పి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సిసిటివి ఫుటేజీలను పరిశీలించగా తిరుపతి పెద్దకాపు లేఔట్‌లోని ఓ లాడ్జిలో బాలునితో ఉన్నట్లు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. బాలుని తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు లేకపోవడం వల్ల బాలుని అపహరించినట్లు నిందితురాలు పేర్కొంది. నిందితురాలు రాజమండ్రివాసిగా గుర్తించారు. బాలున్ని పట్టుకునేందుకు విశేష కృషి చేసిన సిఐలు జగన్‌ మోహన్‌ రెడ్డి, మహేశ్వర్‌ రెడ్డి, రిపీటర్‌, బ్లూ-కోల్ట్స్‌, రక్షక్‌ స్టాఫ్‌ వారిని, సమాచారం ఇచ్చిన ఉద్యోగి ఆవుల ప్రభాకర్‌ యాదవ్‌ను జిల్లా ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు.

➡️