భక్తులతో కిక్కిరిసిన వైకుంఠుని సన్నిథి

Dec 23,2023 22:15
భక్తులతో కిక్కిరిసిన వైకుంఠుని సన్నిథి

ప్రజాశక్తి -తిరుమలతిరుమలలో వైకుంఠ ఏకాదశికి భక్తులతో పోటెత్తింది. అర్ధరాత్రి 12 గంటలకు తలుపులను తెరిచిన అర్చకులు పూజా కైంకర్యాలు నిర్వహించారు…దాదాపు మూడున్నర గంటల పాటు టిటిడి (వివిఐపిలు) ప్రముఖులకు దర్శనం కల్పించింది. నిర్దేశించిన సమయం కన్నా 45 నిమిషాల ముందే సర్వ దర్శనం, రూ 300 ప్రత్యేక దర్శనాల భక్తులను ఆలయంలోకి టిటిడి అనుమతించింది. తిరుమలలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శన శోభ మొదలైంది. శ్రీవారి ఆలయాన్ని రకరకాల పుష్పాలతో టిటిడి ఉద్యానవన శాఖ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ప్రముఖులు, సామాన్య భక్తులతో తిరుమల కిటకిటలాడింది. భక్తుల తాకిడి దష్ట్యా ముందుగానే తిరుపతిలో టోకెన్లను సామాన్య భక్తులకు టిటిడి జారీ చేసింది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ప్రముఖులు పోటెత్తారు. మూడున్నర గంటల పాటు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు స్వామివారి సేవలో తరించారు.4,008 మంది ప్రముఖులకు దర్శనంవైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిందని, భక్తులు సంతప్తిగా దర్శనం చేసుకునేలా చర్యలు తీసుకుందని టిటిడి ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి చెప్పారు. ఏ చిన్న సమస్య రాకుండా ఈ సారి పటిష్ఠమైన ఏర్పాట్లు చేశామని ఆయన అన్నారు. రూ 300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శన టికెట్ల స్లాటెడ్‌ దర్శనాలను నిర్దేశించిన సమయం కంటే 45 నిమిషాల ముందే ప్రారంభించామని,తెల్లవారు జామున 1:30 నిమిషాలకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులను అనుమతించామని టిటిడి ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొత్తం 4008 వీఐపీ బ్రేక్‌ దర్శన టిక్కెట్లు జారీ చేశామన్నారు. క్యూ లైనులోకి వచ్చే భక్తులకు పాలు, కాఫీ, అల్పాహారం అందిస్తున్నామన్నారు.గోవిందుని సేవలో తరించిన ప్రముఖులువైకుంఠ ఉత్తర ద్వార దర్శనంలో ప్రముఖులు పాల్గొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార మిశ్రా, సూర్య కాంత్‌, హిమ కోహ్లీ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్ర బాబు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. ఎల్‌ భట్టి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్యామ్‌ సుందర్ర్‌, కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తారాల రాజశేఖర్‌, రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, గుడివాడ అమర్నాథ్‌ ,ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, శాసన ఉప సభాపతి కోలగట్ల వీరభద్ర స్వామి, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, ఉష శ్రీ చరణ్‌, మేరుగు నాగార్జున, చెల్లబోయిన వేణుగోపాలకష్ణ, సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్‌, భాజపా నేత సిఎం రమేష్‌, వైకాపా ఎంపి రఘురామ కష్ణంరాజు, మంత్రి రోజా, తెదేపా రాజ్యసభ సభ్యులు కనకమేడల, తెదేపా నేతలు కేశినేని నాని, రామ్మోహన్‌ నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉన్నారు.వేడుకగా స్వర్ణ రథోత్సవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో లాగారు. స్వర్ణరథోత్సవాన్ని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులు దర్శించుకున్నారు.టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి, ఈవో ఎవి.ధర్మారెడ్డి, జేఈవో లు సదా భార్గవి, వీరబ్రహ్మం పాల్గొన్నారు.వికృతమాలలో భక్తులకు భోజన ఏర్పాట్లు : హరిప్రసాద్‌ రేణిగుంట మండల పరిధిలోని వికతమాలలో వెలసిన శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయని ఆలయ చైర్మన్‌ డాక్టర్‌ పసుపులేటి హరిప్రసాద్‌ తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటుచేసిన వైకుంఠ ద్వారం ద్వారా దాదాపు 30 వేల మంది శ్రీవారి భక్తులు దర్శనం చేసుకున్నారన్నారు. దర్శనానికి వచ్చిన భక్తాదులకు కనువిందు అయిన భోజనాలతో పాటుగా తీర్థప్రసాదాలను అందించామన్నారు. ఆలయంలో చేపట్టిన ముఖద్వార మండపం, గాలిగోపురం నిర్మాణాలు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన 2024 సంవత్సరపు కాలమాన పట్టికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు వెంకటేశ్వర ప్రసాద్‌, శివ ప్రసాద్‌, మునికష్ణయ్య, బాబూజీ స్కూల్స్‌ చైర్మన్‌ బాలాజీ నాయుడు, మాజీ సర్పంచ్‌ హేమాక్షి, యుగంధర్‌, మురళి, శేఖర్‌ పాల్గొన్నారు.

➡️