భారమవుతున్న ‘బియ్యం’

భారమవుతున్న 'బియ్యం'

భారమవుతున్న ‘బియ్యం’శ్రీ ఏడాదిలోనే కిలోకు రూ.10కిపైగా పెంపుశ్రీ వరి సాగు తగ్గడమే కారణమంటున్న వ్యాపారులుశ్రీ విద్యుత్‌ ఛార్జీల పెంపుతో పెరిగిన మిల్లింగ్‌ ఛార్జీలుశ్రీ ఎగుమతులపై నిషేధం విధించినా ఫలితం శూన్యంప్రజాశక్తి – బాలాయపల్లిఆంధ్రరాష్ట్రం అన్నపూర్ణగా పేరు పొందింది. నిత్యం పంటలు పండిస్తున్నా, వరి సాగుపై రైతులు ఎక్కువగా మొగ్గు చూపేవారు. అటువంటి ఆంధ్రాలోనే బియ్యం ధరలు భగ్గుమంటున్నాయి. ఏడాదిలోనే కిలోకు రూ.10లపైనే ధర పెరిగింది. సూపర్‌ఫైన్‌ రకం బియ్యం 25 కేజీల బస్తా రూ.1,325లు నుంచి రూ.1,550లకు చేరింది. రిటైల్‌గా రూ.1,600లు వసూలు చేస్తున్నారు. ఇక ఫైన్‌ రకం రూ.1,160 నుంచి రూ.1,350లకు, మధ్యస్తరకం రూ.1,250లకు, సాధారణ రకం రూ.900 నుంచి రూ.1,000లకు చేరింది. ఇంత కన్నా తక్కువ ధరకు ఏ బియ్యమూ దుకాణాల్లో లభ్యం కావట్లేదు. దీంతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్‌ బియ్యాన్ని సేకరించి, పాలిష్‌ పట్టించి, కొంత ఇతర దేశాలకు ఎగుమతి చేసి, ఇంకొంత కిలో రూ.25ల చొప్పున దుకాణాలకు సరఫరా చేస్తుండటంతో వీటినే కిలో రూ.35 నుంచి రూ.40లకు అమ్ముతున్నట్లు సమాచారం.సామాన్య, మధ్య తరగతి ప్రజల అవస్థలు..రాష్ట్రంలో ఎక్కువగా వాడుతున్న సన్నరకాల బియ్యం ధరలు అంతకంతకు పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ గణాంకాల ప్రకారం ఈ ఏడాది బియ్యం సగటు ధర కిలో రూ.43.19లు మాత్రమే ఉంది. కానీ, ఏపీలో మాత్రం బియ్యం అధిక ధరకు అమ్ముతున్నారు. తడిసిన, రంగుమారిన, ఎక్కువ కాలం నిల్వ ఉన్న రకాలు కూడా రూ.35ల కంటే తక్కువకు లభించట్లేదు. కామన్‌ వెరైటీ మాత్రమే రూ.40లకి ఇస్తున్నారు. ఫైన్‌ రకాలు కిలో రూ.50లకి తక్కువ లేనేలేవు. గతేడాది కిలో రూ.40-45 మధ్య ఉన్న బియ్యం ఇప్పుడు రూ.55లు చెప్తున్నారు. సన్న బియ్యం కిలో రూ.64లు దాకా పలుకుతున్నాయి. బాస్మతి రకం కిలో రూ.120లపైనే చెప్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో సూపర్‌ఫైన్‌ కిలో సగటున రూ.57.59, ఫైన్‌ రకం రూ.50.60, సాధారణ రకం రూ.38.66లు ఉన్నాయి. మూడు నెలల్లోనే కిలోకు రూ.5నుంచి రూ.10ల వరకు పెరిగాయి.ఆంధ్రలో అధిక రేట్లు..గతంలో నాలుగైదేళ్లకోసారి పెరిగే బియ్యం ధరలు గత ఐదేళ్లుగా ఏటా పెరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్ల సీజన్‌తో నిమిత్తం లేకుండా గతేడాది కాలంలో నెలనెలా బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో బియ్యం ధరలు పెరుగుతున్నాయని గత జూలైలో బాస్మతేతర రకాల బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. దీంతో విదేశాల్లో వరికి విపరీతమైన డిమాండ్‌ రాగా, ధాన్యం అధికంగా పండించే ఏపీలోనూ బియ్యం ధరలు ఏమాత్రం తగ్గకపోగా, స్థానికంగా పెరుగుతూనే ఉండటం గమనార్హం. పేదలు బియ్యం కోనుగోలు చేయలేక అవస్థలు పడుతున్నారు.ప్రభుత్వం రైతు వద్ద ధాన్యం కొనడం లేదు..రాష్ట్రంలో పండించిన ధాన్యంలో సగం కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. ప్రజాపంపిణీ విధానంలో 35 నుంచి 40శాతం సేకరించి, మిగతా ధాన్యాన్ని సేకరించకుండా చేతులెత్తేస్తుండటంతో ఈ ఏడు వరిసాగు తగ్గింది. దీంతో బియ్యం ధరలపై తీవ్రప్రభావం చూపుతోంది. ఖరీఫ్‌ సీజన్‌లో 38.80లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సిన సార్వా వరి 32.62లక్షల ఎకరాల్లోనే సాగవుతోంది. వర్షాభావం, సాగునీటి ఇబ్బందులు, పెట్టుబడుల భారం, ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాలతో 6 లక్షలపైగా ఎకరాల్లో వరి సాగు తగ్గింది. అంతటా వర్షాభావంతో మొదటి పంట ఆలస్యం కావడంతో సాధారణ విస్తీర్ణంలోనూ రెండో పంటగా రైతులందరూ వరివేసే పరిస్థితులు కనిపించడం లేదు. మరోవైపు రబీలో దాళ్వా వరి సాగుకు అవసరమైన నీరు వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఇలాగే గత ఎడాది వరి సాగు బాగా తగ్గింది. సన్నరకాల బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.మిల్లర్లకే అమ్ముకోవాలి..పండించి పంట కల్లలలో ఉంచకోలేక రైతులు వచ్చిన రేటుకు మిల్లర్లకే అమ్ముకుంటున్నారు. వాస్తవంగా గతంలో ప్రభుత్వం సేకరించగా, రైతులు, ప్రజల అవసరాలకు పోగా, ఇంకా 20లక్షల టన్నులపైగా బియ్యం మిగిలిపోవడంతో డిమాండ్‌ లేక ధరలు సామాన్యులకు కాస్త అందుబాటులో ఉండేవి. కానీ గత ఏడాదీ పండిన ధాన్యంలో రెండు సీజన్లకు కలిపి 35 శాతం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో రైతులు నాణ్యమైన సన్న రకాలను మధ్యవర్తుల ద్వారా మిల్లర్లకు అమ్ముకోవడంతో గత ఐదారు నెలలుగా పెరిగిన విద్యుత్‌ ఛార్జీల కారణంగా మిల్లింగ్‌ చార్జీలను దష్టిలో పెట్టుకుని బియ్యం ధరలు పెంచారు.ధర పెరుగుతూనే ఉంది…- గౌతమి, ప్రైవేట్‌ స్కూల్‌ ఉపాధ్యాయురాలు బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉండటంతో బియ్యం కొనాలంటేనే భయమేస్తుంది. ఈ ఏడాది బియ్యం రేట్లు ఇంతగా పెరుగుతాయని అనుకోలేదు. ఈ ధరలు ఇలా పెరుగుతూనే ఉంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎలా జీవించాలి.

➡️