భూ రీసర్వేను పటిష్టంగా చేపట్టండి అధికారులకు జెసి ఆదేశం

భూ రీసర్వేను పటిష్టంగా చేపట్టండి అధికారులకు జెసి ఆదేశం

భూ రీసర్వేను పటిష్టంగా చేపట్టండి అధికారులకు జెసి ఆదేశంపజాశక్తి -రామచంద్రపురం: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూ రీ సర్వే ను పటిష్టంగా చేపట్టాలని తిరుపతి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ అన్నారు. బుధవారం మండలంలోని కేకే పురం లో జరిగే భూ రీ సర్వే ను ఆకస్మికంగా జాయింట్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ రీ సర్వేలో రోజుకు ఎన్ని ఎకరాలు సర్వే చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. రిసర్వేలో అక్రమాలకు చోటు లేకుండా వేగవంతంగా పూర్తిచేయాలని భూ సర్వే సిబ్బందిని ఆదేశించారు. ఫ్రీ సర్వేలో ఎక్కడైనా భూ వివాదాలు తలెత్తితే వెంటనే పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు చేపడుతున్న క్రాప్‌ బుకింగ్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. కట్టు కింద వెంకటాపురంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు పౌష్టికాహారాన్ని సచివాలయ సిబ్బంది సక్రమంగా అందజేస్తున్నారా..? లేదా…? అనే విషయాన్ని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్‌ జి చిన్న వెంకటేశ్వర్లు, భూ రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్‌ ప్రేమ్‌ కుమార్‌, సర్వేర్‌ హేమాద్రి, గ్రామ రెవెన్యూ అధికారి సతీష్‌, కమ్యూనిటీ సర్వేలు మణి రైతులు పాల్గొన్నారు

➡️