మఠం సిబ్బందిని బంధించి కొట్టారుఫిట్‌పర్సన్‌ రమేష్‌నాయుడు

మఠం సిబ్బందిని బంధించి కొట్టారుఫిట్‌పర్సన్‌ రమేష్‌నాయుడు

మఠం సిబ్బందిని బంధించి కొట్టారుఫిట్‌పర్సన్‌ రమేష్‌నాయుడుప్రజాశక్తి – తిరుపతి (మంగళం) హథీరాంజీ మఠం భూములను ఆక్రమించి ల్యాండ్‌ మాఫియాగా ఏర్పడి, పేదలను ఏమార్చి విక్రయిస్తున్నారని, అక్రమ నిర్మాణాల ఫొటోలు తీసిన మఠం సిబ్బందిని బంధించి భౌతికదాడులు చేశారని మఠం ఫిట్‌పర్సన్‌ రమేష్‌నాయుడు అన్నారు. మఠం భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గురువారం తిరుపతి మఠంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తిరుపతి నగర పరిధిలోని ఎంఆర్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న హథీరాంజీ మఠంకు చెందిన 242/బి లోని 9.89 ఎకరాల భూమిలో అక్రమ నిర్మాణాలు జరుపుతున్నారన్న సమాచారంతో ఈ నెల 18న మఠం సిబ్బంది అక్కడకు వెళ్లి ఫోటోలు తీయడానికి ప్రయత్నించగా అక్రమ నిర్మాణదారులు మఠం సిబ్బందిని బంధించి భౌతికంగా తీవ్ర గాయాలు పాలు చేశారని, ఇద్దరి చేతిలో 50వేల రూపాయలు పెట్టి ఫోటోలు తీసుకొని ఈ విషయాలను బయటకు చెబితే లంచం అడిగారని కేసు పెడతామని బెదిరించారన్నారు. తమకు ప్రాణహాని ఉన్నందున భయపడి కేసు పెట్టలేదని మఠం సిబ్బంది చెప్పారన్నారు. 242/బి లోని స్థలాన్ని మఠం ద్వారా 2015లో లీజు పొందిన చిన్నరంగయ్య, పెద్దరంగయ్యలు ఎండోమెంట్‌ ట్రిబ్యునల్‌ ద్వారా ఏడాదికి 2 వేల రూపాయలు చెల్లించే విధంగా అనుమతి తెచ్చుకున్నారన్నారు. వ్యవసాయం చేసుకోవడానికి అని పొందిన భూమిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేసుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ లీజు రద్దు చేయవలసిందిగా హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. అయితే హైకోర్టు మఠంకు, లీజుదారుడుకి స్టేటస్కో ఇచ్చిందన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను గౌరవించకుండా తిరిగి సదరు భూమిలో దౌర్జన్యంగా నిర్మాణాలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం సదరు స్థలంలో చేపట్టిన అక్రమ నిర్మాణాల ఫోటోలు తీసి ఎండోమెంట్‌ కమిషనర్‌ కు లేఖ రాశానన్నారు. స్పందించిన కమిషనర్‌ తిరుపతి జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు సదరు స్థలంలో నిర్మాణాలను ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలు రాశారన్నారు. సదరు స్థలంలో కడప జిల్లాకు చెందిన నవీన్‌ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారుడుగా ఉన్నాడని, అతనిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా అధికారులకు విజ్ఞప్తి చేశానన్నారు. హథీరాంజీ మఠం భూములపై సరైన పర్యవేక్షణ లేకపోయినకారణంగా నేడు మఠం భూములను కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారిందన్నారు. 242/బి లో కొందరు పోలీసు ఉన్నతాధికారులూ స్థలాలు కొన్నట్టుగా సమాచారం అందిందని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నామన్నారు. ఇకనైనా మఠం భూములను ఎవరు అమ్మిన కొనవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మఠం ఏఈఓ శ్రీనివాసులరెడ్డి, లా అధికారిని ఎస్‌ వి. కవిత పాల్గొన్నారు.

➡️