మహిళలు స్వయం శక్తితో ఎదగాలి

మహిళలు స్వయం శక్తితో ఎదగాలి

మహిళలు స్వయం శక్తితో ఎదగాలితిరుపతి టౌన్‌ : మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పించాలన్న ముఖ్యమంత్రి వై.యస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన సంఘ సభ్యులకు తిరుపతిలోని అనూస్‌ ప్రాంగణంలో మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ విజయలక్ష్మి , తిరుపతి నగర పాలక సంస్థ మేయర్‌ శిరీష ,అనూస్‌ సంస్థ యం.డి అనురాధ తో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మిషన్‌ డైరెక్టర్‌ మాట్లాడుతూ ఈ శిక్షణకు గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకున్న, ఆసక్తి కలిగిన స్వయం సహాయక సంఘ సభ్యులను ఎంపికచేసి వారు స్వయం ఉపాధి పొందేలా శిక్షణ ఇస్తామన్నారు. మేయర్‌ శిరీష మాట్లాడుతూ ప్రతి మహిళను లక్షాధికారిని చేయడమే సిఎం లక్ష్యమన్నారు. చిత్తూరు జిల్లా మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్‌ రాధమ్మ, మెప్మా ఎఒ రామాంజనేయులు, ఎస్‌ఎంఎంలు ఆదినారాయణ, శ్రీనివాస్‌, సిఎంఎం కృష్ణవేణి, ఆర్‌పిలు పాల్గొన్నారు. అనంతరం రామచంద్ర పుష్కరిణి సమీపంలో మెప్మా మహిళా మార్ట్‌ ఆధ్వర్యంలో మహిళలు నూతనంగా ఏర్పాటు చేసిన చపాతి మేకింగ్‌ యూనిట్‌ ను నగర మేయర్‌ డాక్టర్‌ శిరీష చేతుల మీదుగా ప్రారంభించారు.

➡️