మహిళా వర్సిటీలో ఓటర్ల జాగృతి

మహిళా వర్సిటీలో ఓటర్ల జాగృతి

మహిళా వర్సిటీలో ఓటర్ల జాగృతి కార్యక్రమంప్రజాశక్తి – క్యాంపస్ :మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్స్, రీజినల్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఎస్ఎస్ ఉత్తర్వుల మేరకు శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఎన్ఎస్ఎస్ యూనిట్ 5 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మాధవి, ఎన్ఎస్ఎస్ యూనిట్ 16 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ వై. అనిత ఆధ్వర్యంలో ఓటర్ల జాగృతి కార్యక్రమం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రేణుక మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో యువత విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, సరియైన వ్యక్తులను ఎన్నుకోవాలని కోరారు. డాక్టర్ శిరీష మాట్లాడుతూ దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఓటుకు మాత్రమే ఉందని అందువల్ల తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం అత్యుత్తమ ధర్మం అని తెలిపారు. డాక్టర్ వై. అనిత మాట్లాడుతూ విద్యావంతులమైన మనము ఓటు హక్కు గురించి తెలుసుకోవడమే కాకుండా తెలియని ఎంతో మందికి దీని యొక్క విలువను తెలియజేయడం మన కనీస ధర్మం అని చెప్పారు. డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లకు గురి కాకుండా నిర్భయంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ 5 ఎన్ఎస్ఎస్ యూనిట్ 16 వాలంటీర్స్ పాల్గొన్నారు.

➡️