మాజీ సైనికుల పేరుతో ఆర్డీవో భూదందా.. పూర్వపు తహశీల్దార్‌, కార్యాలయ సిబ్బంది సంతకాలు సైతం ఫోర్జరీకలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌పై మంత్రి ద్వారా ఒత్తిళ్లుబోగస్‌ పత్రాలతో నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి కలెక్టరేట్లో దస్త్రం సిద్ధంకురుకాలువ భూములపై కన్నేసిన పెద్దలకుతిరుపతి మాజీ ఆర్డీవో అండదండ

మాజీ సైనికుల పేరుతో ఆర్డీవో భూదందా.. పూర్వపు తహశీల్దార్‌, కార్యాలయ సిబ్బంది సంతకాలు సైతం ఫోర్జరీకలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌పై మంత్రి ద్వారా ఒత్తిళ్లుబోగస్‌ పత్రాలతో నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి కలెక్టరేట్లో దస్త్రం సిద్ధంకురుకాలువ భూములపై కన్నేసిన పెద్దలకుతిరుపతి మాజీ ఆర్డీవో అండదండ

మాజీ సైనికుల పేరుతో ఆర్డీవో భూదందా.. పూర్వపు తహశీల్దార్‌, కార్యాలయ సిబ్బంది సంతకాలు సైతం ఫోర్జరీకలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌పై మంత్రి ద్వారా ఒత్తిళ్లుబోగస్‌ పత్రాలతో నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి కలెక్టరేట్లో దస్త్రం సిద్ధంకురుకాలువ భూములపై కన్నేసిన పెద్దలకుతిరుపతి మాజీ ఆర్డీవో అండదండప్రజాశక్తి- తిరుపతి బ్యూరో: అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చు.. నా ఇష్టం.. నా రాజ్యం.. నేను అనుకున్నదే వేదం… అనే విధంగా తిరుపతి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో సుదీర్ఘకాలం ఆర్డీఓగా పనిచేసిన పూర్వపు ఆర్డీవో రేణిగుంట మండలం కురుకాలవ రెవెన్యూ గ్రామంలో మాజీ సైనికుల పేరుతో సాగిస్తున్న భూదందా అంతా ఇంతా కాదు. రేణిగుంట పూర్వపు తహశీల్దార్ల సంతకాలను సైతం ఆర్డీఓ ఫోర్జరీ చేసి జిల్లా కలెక్టర్‌ను జాయింట్‌ కలెక్టర్‌ను సైతం తాను సృష్టించిన బోగస్‌ రికార్డులు నిజమైన రికార్డులుగా భావించాలని జిల్లాలోని ఓ పెద్ద మంత్రి ద్వారా ఒత్తిడి తెప్పిస్తూ ఆయన సాగిస్తున్న భూదందా చూస్తూంటే రాష్ట్రంలోని యావత్‌ రెవెన్యూ యంత్రాంగాన్ని ఆశ్చర్యచకితులను చేస్తోంది. రేణిగుంట మండలం కురుకాలవ రెవెన్యూ సర్వేనెంబర్‌లో 266, 267, 268 సర్వే నంబర్లలో 1986వ సంవత్సరంలో నలుగురు వ్యక్తులకు 16ఎకరాల భూమిని అధికారికంగా అప్పట్లో సర్వే నంబర్‌ 1 బ్లాక్‌ నంబర్‌ నుంచి విడదీసి సబ్‌డివిజన్‌ చేసి కొత్త నంబర్లు కేటాయించి అసైన్మెంట్‌ చేశారు. ఆ మేరకు రైతులు భూమిని సాగు చేసుకునేవారు. అయితే 1993లో రేణిగుంట మండల రెవెన్యూ అధికారి మండల వ్యాప్తంగా అసైన్మెంట్‌ జరిగిన భూములను సాగు చేయలేదని డిడిస్‌ నంబర్‌ ఎ/436/ 1994గా దాదాపు 90 ఎకరాల భూమిని అసైన్మెంట్‌ క్యాన్సల్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు ఈసర్వే నెంబర్లలో భూములు సాగు చేసుకుంటున్న రైతులు ఆ వెంటనే మండల రెవెన్యూ అధికారికి తమ భూముల క్యాన్సల్‌ ఉత్తర్వులను పునఃసమీక్షించాలని తమ భూములను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలించాలని విన్నవించడంతో అప్పటి మండల రెవెన్యూ అధికారి కిందిస్థాయి అధికారుల రిపోర్టులపై ఆధారపడకుండా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి సాగులో ఉన్న ఈ భూములకు 4.4 1994 సంవత్సరంలో తాను క్యాన్సల్‌ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకొన్న ఉత్తర్వులు మరలా జారీ చేశారు. ఆ మేరకు భూమిని సాగు చేసుకునేవారు. 2011వ సంవత్సరంలో రెవెన్యూ రికార్డులు అడంగల్‌ వన్‌బి వెబ్‌లాండ్‌లో నమోదు చేసే సమయంలో భూమిలో సాగులో ఉన్న రైతుల పేర్లను నమోదు చేశారు. అయితే 2013 వచ్చిన మండల రెవెన్యూ అధికారి 1994లో అప్పటి మండల రెవెన్యూ అధికారి ఇచ్చిన భూముల క్యాన్సిల్‌ ఉత్తర్వులను 20వ సంవత్సరాల తర్వాత తన సొంత నిర్ణయంతో అమలుపరిచి వెబ్‌ లాండ్‌లో నమోదైన మండల వ్యాప్తంగా ఉన్న 90ఎకరాల భూమిని రైతులు ఎటువంటి నోటీసు ముందస్తు సమాచారం ఇవ్వకుండా వెబ్‌లాండ్‌ రికార్డుల నుంచి తొలగించారు. 1994లో భూమల క్యాన్సర్‌ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న భూములను సైతం వెబ్‌లాండ్‌ నుంచి తొలగించడంతో రైతులు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ మేరకు రెవెన్యూ డివిజన్‌ అధికారి భూములపై విచారణ జరిపి రైతులకు అనుకూలంగా ఉత్తర్వులు కూడా ఇచ్చి ఉన్నారు. అయితే ఆన్‌ లైన్‌ రికార్డ్‌ వన్‌బి, అడంగల్‌లో రైతుల పేర్లు నమోదు చేయడానికి రెవెన్యూ అధికారులు భారీగా డిమాండ్‌ చేయడంతో రైతులు మిన్నకుండిపోయారు. ఆన్‌లైన్‌ రెవెన్యూ రికార్డులలో అనాధనముగా నమోదు ఉండడంతో ఈ భూమిపై తిరుపతిలో సుదీర్ఘ కాలం పాటు పనిచేసిన ఓ ఆర్‌డిఓ కన్ను పడింది. ఆయన ఓ పెద్ద మంత్రికి అంతరంగికుడిగా ఉండడంతో పాటు కనకం సరసం ఉంటే ఏదానికైనా సిద్ధమనే పాల్పడే లక్షణాలున్న ఈ అధికారి మనసులో ఈ భూమిని కాజేయాలని ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఆయన అక్కడ పనిచేస్తున్నప్పుడు ఈ పనిచేస్తే తనకి ఎక్కడ చుట్టుకుంటుందోనని భావించి తాను బదిలీ అయిన తర్వాత తాను అనుకున్న ప్రణాళికను పకడ్బందీగా అమలు పరచడానికి అన్ని రకాల హంగులు సిద్ధం చేశారు. మాజీ సైనికులకు ఈభూమిని 2001- 2002 సంవత్సరంలో అసైన్మెంట్‌ చేసినట్టుగా బోగస్‌ రికార్డు సృష్టించారు. ఆ బోగస్‌ రికార్డుల మేరకు రేణిగుంట తహశీల్దార్‌ నిషేధిత జాబితా నుంచి ఈ భూములను తొలగించాలని ఆర్డీవోకు రిపోర్టు పంపినట్లు అప్పట్లో ఆర్డీవోగా ఉన్న ఈ అధికారి తహశీల్దార్‌ సిఫార్సుపై జిల్లా కలెక్టర్‌కు నిషేధిత జాబితా నుంచి తొలగించాలని సిఫార్సు చేసినట్లుగా ఉత్తర్వులు తయారు చేసి కలెక్టర్‌ కార్యాలయానికి సంబంధిత విభాగానికి పాత తేది 2022లో పంపించినట్లుగా సృష్టించారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఈఫైలు లీగల్‌సెల్‌కు వెళ్లడంతో అక్కడి వ్యవహారాలు చూస్తున్న లీగల్‌ సెల్‌ డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారి ఈ మాజీ సైనికుల భూమి నిషేధిత జాబితా తొలగింపు ఫైలు పై కొర్రీలు వేయడంతో అతనిని అప్పటికప్పుడే మార్చివేసి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి నుంచి తహశీల్దార్‌గా రివర్షన్‌ పొంది తమ పెద్ద మంత్రి సిఫార్సుతో మరలా డిప్యూటీ కలెక్టర్‌స్థాయి పోస్ట్‌ తెచ్చుకున్న అధికారిని ఆస్థానంలో కూర్చోబెట్టారు. 2001- 2002 సంవత్సరంలో మాజీ సైనికుల పేరుతో అసైన్మెంట్‌ పొంది ఉంటే ఎందుకు ఈరోజు వరకు వారి భూమిని మాన్యువల్‌ రెవెన్యూ రికార్డులో నమోదు చేయకుండా వెబ్‌ లాండ్‌ కార్డులలో నమోదు కాలేదు ఈ రికార్డులు సృష్టించిన తిరుపతి పూర్వపు ఆర్‌డిఓకే తెలియాలి. అంతేగాక రేణిగుంట మండలం పైలట్‌ ప్రాజెక్టు కింద భూసంబంధిత రికార్డులను దాదాపు రెండు సంవత్సరాల కిందటే ల్యాండ్‌ సెటిల్మెంట్‌ అధికారులు స్కానింగ్‌ చేసి ఉన్నారు. ఇప్పుడు రికార్డులు ఏమాత్రం తారుమారు చేసినా స్కాన్‌ రికార్డుల్లో వాస్తవాలు బయటపడతాయి. ఈ విషయాలు ఎక్కడైనా బయట చెబుతాడేమోనని ఆలోచించిన ఈ పూర్వపు ఆర్డీవో సంబంధిత విభాగంలో ఉన్న మరొక కీలక వ్యక్తిని సైతం ఇతర విభాగానికి బదిలీ చేపించారు. ఈఫైలు బాగోతం ఎక్కడ బయటపడి తమ ఉనికికి ఎక్కడ ఇబ్బంది జరుగుతుందోనని భావించిన తిరుపతి పూర్వపు ఆర్డీవో తమ అనంగు మంత్రితో కలెక్టర్‌ జాయింట్‌ కలెక్టర్‌పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి యుద్ధ ప్రాతిపదికన ఈ 16ఎకరాల భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని గత వారం రోజులుగా తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు కలెక్టరేట్‌ నుంచి విశ్వసనీయ సమాచారం. దాదాపు 60 కోట్ల నుంచి 70 కోట్ల వరకు విలువ చేసే భూములను కాజేసిపై అధికారులకు చిల్లరలు ముట్ట చెప్పి తమపని కానిచ్చుకోవడానికి పాపం ఈ ఆర్‌డిఓ ప్రతిరోజు చాలా శ్రమ పడుతున్నట్లు సంబంధిత శాఖలో భారీస్థాయిలో గుసగుసలు వినపడుతున్నాయి. కాగా తమ భూములను బోగస్‌ రికార్డులతో కాజేయాలని చూస్తున్న వ్యక్తులు తమ భూముల జోలికి వస్తే భోగస్‌ రికార్డులు సృష్టించిన పూర్వపు ఆర్డీవోతో పాటు ఇందులో సంబంధం ఉన్న అతని అంతరంగికులకు సైతం తగిన గుణపాఠం బహిరంగంగానే చెబుతామని భూ యజమానులు హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ జాయింట్‌ కలెక్టర్‌ తమ దగ్గరికి నిషేధిత జాబితా తొలగింపు కోసం వస్తున్న ఈ బోగస్‌ దస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించి బోగస్‌ రికార్డులు సష్టించిన పూర్వపు ఆర్డిఓపైన అందుకు సంబంధిత ఆయన అంతరంగికుల పైన కఠిన చర్యలు కోవాలని భూముల రైతులు కోరుతున్నారు. కాగా జాయింట్‌ కలెక్టర్‌ ఈ భూముల నిషేధిత జాబితా తొలగింపుకు అభ్యంతరకరంగా మారుతున్నారన్న సమాచారంతో త్వరలోనే జాయింట్‌ కలెక్టర్‌ సైతం ఈ జిల్లా నుంచి బదిలీ చేయించడానికి ఈ పూర్వపు ఆర్డీవో పెద్దమంత్రికి సిఫార్సు చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

➡️