ముగ్గురు విద్యార్థుల అదృశ్యంతల్లి ఫిర్యాదుతో పొలీసులు కేసు నమోదు

ముగ్గురు విద్యార్థుల అదృశ్యంతల్లి ఫిర్యాదుతో పొలీసులు కేసు నమోదు

ముగ్గురు విద్యార్థుల అదృశ్యంతల్లి ఫిర్యాదుతో పొలీసులు కేసు నమోదుప్రజాశక్తి -తిరుమల: తిరుమలోని స్థానిక ఆర్బీసీ సెంటర్‌కు చెందిన ముగ్గురు చిన్నారు లు బుధవారం మధ్యా హ్నం అదశమయ్యారు. తిరుమల టుటౌన్‌ ఎస్‌ఐ సాయి నాథ్‌ చౌదరి కథనం మేరకు.. తిరుమలకు చెందిన ఎస్‌ కష్ణ తనయుడు చంద్రశేఖర్‌, యోగేశ్‌ కుమారుడు వైభవ్‌ యోగేశ్‌, శ్రీవరదన్‌ అదశ్యమైనట్లు తెలిపారు. అదృశ్యమైన ముగ్గురు పిల్లల వయసు 13 సంవత్సరాలు. ముగ్గురు విద్యార్థులు తిరుమలలోని ఎస్వీ హైస్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం పుస్తకాలు తెచ్చుకునేందుకు ఇంటికి వెళతామని పాఠశాలలో చెప్పారు. ఇంటికి వచ్చి ల్యాప్‌టాప్‌ తీసుకుని బస్సెక్కి తిరుపతి ఏడు కొండల బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ్నుంచి వారి ఆచూకీ తెలియలేదు. విద్యార్థులు ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, పాఠశాల టీచర్లను ఆరా తీశారు. వారు కూడా తెలియదని చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2 టౌన్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

➡️