మే2 నుంచి ఎపిఆర్‌ సెట్‌ ప్రవేశ పరీక్

మే2 నుంచి ఎపిఆర్‌ సెట్‌ ప్రవేశ పరీక్షప్రజాశక్తి – క్యాంపస్‌ ఏపీ ఆర్‌ సెట్‌ 2023-24 ప్రవేశ పరీక్షలు మే 2 నుంచి 5 వ తేదీ వరకు నిర్వహించ నున్నారు. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పీహెచ్‌.డీ సీట్ల భర్తీకి ఏపీ ఆర్‌ సెట్‌ 2023- 24 నోటిఫికేషన్‌ వెలబడిన విషయం తెలిసిందే. మార్చి 19వ తేదీతో దరఖాస్తు గడువు ముగిసింది. అయితే, ఈ నెల 29 వరకూ రూ. 2 వేలు అపరాధ రుసుంతోనూ, ఏప్రిల్‌ 6 వ తేదీ వరకూ రూ. 5 వేలు అపరాధ రుసుంతో దరఖాస్తు గడవు ఉంది.ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఏపీ ఆర్‌ సెట్‌ 2023 -24 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి.దేవప్రసాదరాజు తెలిపారు. అవకాశాన్ని విద్యార్థులు, అభ్యర్థులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళంప్రజాశక్తి – తిరుపతి సిటి బెంగుళూరుకు చెందిన అగర్వాల్‌ ఇండెక్స్‌ పర్నస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ గురువారం ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.20 లక్షలు విరాళం అందించింది. ఈ సంస్థ ప్రతినిధి శ్రీ రాఘవేంద్ర ఈ మేరకు విరాళం డిడిని తిరుపతిలోని పరిపాలన భవనంలో టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.17-25 తేదీల్లో కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు రామచంద్రాపురం (చంద్రగిరి): చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మౌత్సవాలు ఏప్రిల్‌ 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్‌ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మౌత్సవాలు ప్రారంభమవుతాయి. 23న జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో రూ.750 చెల్లించి గృహస్తులు పాల్గొనవచ్చు. 26న శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, సంగీత కచేరీలు నిర్వహించనున్నారు.

➡️