రాజీవ్‌ నగర్‌లో భూ ఆక్రమణలుసీపీఎం చొరవతో అడ్డుకట్ట

రాజీవ్‌ నగర్‌లో భూ ఆక్రమణలుసీపీఎం చొరవతో అడ్డుకట్ట

రాజీవ్‌ నగర్‌లో భూ ఆక్రమణలుసీపీఎం చొరవతో అడ్డుకట్టప్రజాశక్తి- శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి పట్టణ శివారు ప్రాంతమైన రాజీవ్‌నగర్‌లో భూ క్రమణలు నిత్యకత్యంలా మారుతున్నాయి. కొందరు రాజకీయ నేతలు సిండికేట్‌ గా ఏర్పడి ఖాళీ జాగా కనబడితే చాలు అదును చూసి పాగా వేసేస్తున్నారు. పేదల ంటి నిర్మాణాలు, భవిష్యత్‌ అవసరాల కోసం రాజీవ్‌ నగర్‌లో కేటాయించిన వందలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలు ఇప్పటికే ఆక్రమణకు గురైన తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజీవ్‌ నగర్‌ లో కమ్యూనిటీ అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ స్థలాలను సైతం అక్రమార్కులు వదలడం లేదు. ఈక్రమంలోనే రాజీవ్‌ నగర్‌ ఓవర్‌ హెడ్‌ట్యాంక్‌ దగ్గర మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి కేటాయించిన 10సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని ఆదివారం కొందరు రాజకీయ నాయకులు ఆక్రమించారు. అందరూ చూస్తుండగానే జెసిబిలతో తవ్వించి పునాదులు వేశారు. ఇదేంటని అడిగిన స్థానికులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దీంతో రాజీవ్‌నగర్‌ వాసులు స్థానికంగా ఉంటున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అంగేరి పుల్లయ్య దష్టికి సమస్యను తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన ఆయన సంఘటనా స్థలానికి వెళ్లి ఆక్రమణలను అడ్డుకున్నారు. అక్కడ నుంచే జిల్లా కలెక్టర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించి స్థానిక రెవెన్యూ సిబ్బంది సహకారంతో పనులను పూర్తిగా ఆపివేయించారు. రాజీవ్‌నగర్‌ ప్రాంతంలో భవిష్యత్తు అవసరాలకు కేటాయించిన ప్రభుత్వ స్థలాలన్నింటిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పుల్లయ్య డిమాండ్‌ చేశారు. సత్వరమే స్పందించి రాజీవ్‌ నగర్లో భూఅక్రమణకు అడ్డుకట్ట వేసేలా ఆదేశాలు జారీచేసిన జిల్లా కలెక్టర్‌కు పుల్లయ్య కతజ్ఞతలు తెలిపారు.

➡️