రాత్రికి రాత్రే మార్పులుతిరుమలలో నిబంధనలు ఉల్లంఘన

రాత్రికి రాత్రే మార్పులుతిరుమలలో నిబంధనలు ఉల్లంఘన

రాత్రికి రాత్రే మార్పులుతిరుమలలో నిబంధనలు ఉల్లంఘనవిశాఖ శారదా పీఠం మఠం నిర్వాకంప్రజాశక్తి -తిరుమలతిరుమలలోని విశాఖ శారదా పీఠం మఠాన్ని ఏపీ హైకోర్టు అడ్వకేట్‌ కమిషన్‌ శనివారం పరిశీలించింది. కొండపైన భవన నిర్మాణ నిబంధనలకు విరుద్ధంగా శారదాపీఠం వారు మఠం నిర్మించారని తిరుక్షేత్రాల పరిరక్షణ సమితి నేత తిరుపతికి చెందిన తుమ్మా ఓంకార్‌ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసారు. శారదపీఠం భూఆక్రమణ చేసిందంటూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు, వాస్తవాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడ్వకేట్‌ కమిషన్‌ ను నియమించింది. ఈ మేరకు హైకోర్డు న్యాయవాది వివేకానంద విరుపాక్ష, పిటిషినర్‌ తరపు న్యాయవాది జితేంద్ర, టీటీడీ న్యాయాధికారి, రెవెన్యూ అధికారులు మఠాన్ని పరిశీలించారు. భవనం యొక్క చుట్టు కొలతలు, ఎత్తుతో పాటు నిభందనలను ఎక్కడైనా అతిక్రమించారా అనే కోణంలో క్షేత్రస్థాయిలో అడ్వకేట్‌ కమిషనర్‌ పరిశీలించారు. కాగా పిటిషన్‌ వేసిన నాటికి… నేటికి భవనం యొక్క పరిస్థితి వేరేలా ఉందని, హైకోర్టు ఆర్డరు బేఖాతరు చేస్తూ మఠం నిర్వహకులు భవన నిర్మాణం చేపడుతున్నారని, కమిషన్‌ తనిఖీకి వస్తుందని తెలిపి రాత్రికిరాత్రి సెల్లార్‌ లోని గదులను, మండపం యొక్క గోడలను తొలగించి కార్‌ పార్కింగ్‌ స్థలంగా మార్చారని, ఏ మాత్రం భద్రతా ప్రమాణాలు లేకుండా కనీసం సెట్‌ బ్యాక్స్‌ కూడా లేకుండా ఇష్టప్రకారం భవనాన్ని నిర్భించారని పిటిషనర్‌ అన్నారు. అతిక్రమణలను తొలగించమని కోర్టు తీర్పు ఇస్తుందని ఆశిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేసారు.

➡️