రాపిడో డ్రైవర్లకు రివార్డులు ప్రదానం

రాపిడో డ్రైవర్లకు రివార్డులు ప్రదానం

రాపిడో డ్రైవర్లకు రివార్డులు ప్రదానంప్రజాశక్తి- తిరుపతి సిటీరాపిడో యాప్‌ ద్వారా ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు క్షేమంగా చేరవేస్తున్న డ్రైవర్లకు ఆ సంస్థ రివార్డులను అందజేసింది. తిరుపతిలో తొలిసారిగా జరిగిన ఈ కార్యక్రమానికి ర్యాపిడో సహ వ్యవస్థాపకుడు పవన్‌ గుంటుపల్లి ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రముఖ ప్రయాణ యాప్‌ రాపిడో, దాని కెప్టెన్ల (డ్రైవర్ల) స్థిరత్వం, అసాధారణమైన సహకారాన్ని గుర్తించి, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించిన వారి సేవకు రివార్డులు అందజేస్తున్నామన్నారు. తిరుపతి ప్రాంతంలో సుమారు 250 మంది రాపిదో డ్రైవర్లకు అవార్డులతో పాటు, మైక్రోవేవ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, పవర్‌ బ్యాంక్‌లు, వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్‌లు వంటి బహుమతులు అందించామన్నారు.

➡️