రెండు నెలల్లో టిష్యూ కల్చర్‌ ల్యాబ్‌ అందుబాటులోకి..ఔషధ మొక్కల ఉత్పత్తికి ప్రాధాన్యతప్రజాశక్తితో స్టేట్‌ సిల్వికల్చరిస్ట్‌ యశోదబాయి

Jan 7,2024 22:24
రెండు నెలల్లో టిష్యూ కల్చర్‌ ల్యాబ్‌ అందుబాటులోకి..ఔషధ మొక్కల ఉత్పత్తికి ప్రాధాన్యతప్రజాశక్తితో స్టేట్‌ సిల్వికల్చరిస్ట్‌ యశోదబాయి

ప్రజాశక్తి- తిరుపతి (మంగళం): ప్రకృతి సహజ సిద్ధంగా పెరగాలని, వాటిలో అంతరించిపోతున్న మొక్కలు, వృక్షజాతులను సంరక్షించడానికి బయోట్రీమ్‌లో ప్రత్యేక పరిశోధనలు చేస్తూ విరివిగా అటువంటి మొక్కలను సంరక్షించి అందిస్తున్నామని అటవీశాఖ బయోట్రీమ్‌ స్టేట్‌ సిల్వికల్చరిస్ట్‌ యశోధబాయి చెప్పారు. బయోట్రీమ్‌ ద్వారా ఎటువంటి మొక్కల రక్షణ, ఉత్పత్తులు, చాలా కాలం తరువాత బయోట్రీమ్‌ భవనంలో మరమ్మతులు వంటి అంశాలపై ప్రజాశక్తి యశోధబాయితో ప్రత్యేక ముఖాముఖిని నిర్వహించింది. ప్రజాశక్తి: ఎన్ని రకాల మొక్కల జాతులకు సంబంధించి బయోట్రీమ్‌లో పునరుత్పత్తులు చేస్తున్నారు? అధికారిణి: బయోట్రీమ్‌లో దాదాపుగా 24రకాల మొక్కల జాతులను సంరక్షిస్తూ, వాటికి కృత్రిమ వాతావరణం ఏర్పాటు చేసి రక్షిస్తున్నాం. నాణ్యమైన విత్తణాలను సేకరించి వాటి నుండి ఈ ఉత్పత్తులను తయారు చేస్తున్నాం. ప్రజాశక్తి: పరిశ్రమల్లో ఉపయోగపడే మెటిరీయల్‌కు సంబంధించిన మొక్కలను తయారు చేస్తున్నారా?అధికారిణి: పరిశ్రమలకు ఉపయోగపడేవి బయో ట్రీమ్‌లో మలబార్‌ వేప ఉంది. కానీ ఇదంతా రీసైక్లింగ్‌ పద్ధతిలో జరిగితేనే మంచి ఫలితాలను మనం సాధించగలుగుతాం. బద్వేల్‌లో ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సెంచూరీ కంపెనీకి సంబంధించిన యూనిట్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీకి కావలసిన ముడి సరుకులు సమీప ప్రాంత రైతుల నుండి చేరితే ఇక్కడి రైతులు మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. కాని దాని కన్నా మొదటగా రైతులు మలబార్‌ వేపచెట్ల విశిష్టతను తెలుసుకోవాల్సివుంది. రైతులు స్వతహాగా మలబార్‌ వేప మొక్కలను సంరక్షస్తూనే వాటిని మార్కెటింగ్‌ చేసుకోవడం నేర్చుకోవాలి. ఇదే సమయంలో కంపెనీ వారు వారికి కావలసిన ముడి సరుకు ఇక్కడే దొరుకుతోందని గ్రహించి రైతులతో ఒప్పందాలు చేసుకుంటే మంచి లాభాలు రైతుకు వస్తాయి. ప్రజాశక్తి: ఔషద మొక్కలను తయారు చేస్తున్నారా?అధికారిణి: బయోట్రీమ్‌లో ఔషధ మొక్కలను తయారు చేస్తున్నాం. ప్రస్తుతం మోగి మొక్కలను పెంచుతున్నాం. ఇవి మధుమేహ్య వ్యాధి నివారణకు మందులలో వినియోగిస్తారు. ఆయుర్వేద మందుల తయారీలో మోగిని వాడుతారు. దీని ద్వారా మధుమేహ్యంతో భాదపడే వారు ఇది చెట్టుగా ఎదిగిన తరువాత పండ్లు వస్తాయి. ఇవి చూడడానికి నేరేడు పండ్లు వలే ఉంటాయి. వాటిని తింటే కూడా మధేమేహ్యం తగ్గుతుందని చాలా మంది భావిస్తారు. ప్రజాశక్తి: టిష్యూ కల్చర్‌ ల్యాబ్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?అధికారిణి: శేషాచల అడవుల్లోని అరుదైన మొక్క జాతుల సంరక్షణ, పరిశోధన కోసం బయోట్రీమ్‌ నిర్మాణాన్ని 1984లో ప్రారంభించి 1989లో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకోచ్చారు. ఆనాటి నుండి శేషాచల అడవుల్లోని ఎన్నో వందల మొక్కలపై పరిశోధనలు చేసి అరుదైన వాటిని సంరక్షిస్తున్నాం. ప్రస్తుతం బయోట్రీమ్‌లో పునఃనిర్మాణ పనులు చేస్తున్నాం. రెండు నెలల్లో టిష్యూ కల్చర్‌ ల్యాబ్‌ను నూతన హంగులతో అందుబాటులోకి తీసుకొస్తాం.

➡️