రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం పట్టివేతప్రజాశక్తి -దొరవారిసత్రం:-అక్రమ రవాణా సాగుతున్న పిడిఎస్ రేషన్ బియ్యం ను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని తిరుపతి విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లై సిబ్బంది కలిసి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది. వివరాల మేరకు దొరవారిసత్రం మండల పరిధిలోని తుంగమడుగు గ్రామ సమీపము వద్ద బొలెరో పికప్ వాహనంలో 72 బస్తాలు, అనగా3520, కేజీల బియ్యం ను శుక్రవారం విజిలెన్స్ అధికారులు స్వాధీనపరచుకున్నారు. వాహనం తో పాటు వాహనం డ్రైవర్ మురళి పై కేసు నమోదు చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు పిడిఎస్ బియ్యాన్ని సూళ్లూరుపేట ఎం ఎల్ ఎస్ పాయింట్ నందు అప్పగించి రసీదు పొందినట్లు తెలియపరిచారు. ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ ఎం రామకృష్ణ నాయక్, సీనియర్ అసిస్టెంట్ కే ఎల్ వి సుబ్రహ్మణ్యం, సివిల్ సప్లై డిటి ఓబయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️